13, ఫిబ్రవరి 2020, గురువారం

పుల్వామా స్ఫురణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సరిహద్దుల గోడ దాటు
బీభత్సం దూకువేళ,
కశ్మీర్ కంఠం చుట్టూ
ఉరి బిగించి ఉన్నవేళ..
నిగమాగమ స్వర విపంచి
‘నిప్పుల’రాగం పలికెను!
వరములిచ్చు కరములందు
శత‘శతఘ్ని’ చెలరేగెను..
గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మన వైమానిక దళాలు పాకిస్తాన్‌లోని ‘బాలకోట’ వద్ద నెలకొని ఉండిన బీభత్స స్థావరాలను బద్దలుకొట్టాయి. గత ఏడాది ఫిబ్రవరి పదునాలుగవ తేదీన జాయిష్ ఏ మొహమ్మద్- జెఇఎమ్- అన్న పాకిస్తానీ జిహాదీ బీభత్స ముఠాకు చెందిన ముష్కరులు జమ్మూ కశ్మీర్‌లోని ‘అవన్తీపురా’ వద్ద జరిపిన పైశాచిక హత్యాకాండ ‘బాలకోట’ వద్ద మన వైమానికులు జరిపిన సాయుధ చికిత్సకు తక్షణ నేపథ్యం! దశాబ్దుల తరబడి పాకిస్తానీ ప్రత్యక్ష, ప్రచ్ఛన్న జిహాదీలు జరిపిన భయంకర బీభత్సకాండను ఉపేక్షించిన మన ప్రభుత్వం ఇటీవలికాలంలో ‘దోషులను దండించే కార్యక్రమానికి’ శ్రీకారం చుట్టింది. బీభత్సకారులను ఇలా దండించడంలో భాగం మన సైనికులు ‘బాలకోట’ వద్ద నెలకొని ఉండిన జిహాదీల స్థావరాలను ధ్వంసం చేయడం. అవన్తీపురా జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో నెలకొని ఉంది. జమ్మూ-శ్రీనగర్ ‘మహాపథం’ హైవేలో వున్న అవన్తీపురా సమీపంలో పయనిస్తుండిన ‘కేంద్ర రిజర్వ్ పోలీసుల’ వాహనశ్రేణిపై ‘జాయిష్ ఏ మొహమ్మద్’ బీభత్సకారులు గత ఏడాది ఫిబ్రవరి పదునాలుగవ తేదీన జరిపిన దాడులలో నలభైమంది మన వీరులు అమరులయ్యారు. ఈ రాక్షస చర్యకు ఒడిగట్టిన పాకిస్తానీ జిహాదీ ముష్కరులను ఇరవై ఆరవ తేదీన మన ప్రభుత్వం శిక్షించగలిగింది. పుల్వామా -అవన్తీపురా వద్ద అసువులుబాసిన మన అమర జవానుల త్యాగనిరతికి భారతజాతి ఘటించిన ఆయుధ సుమాంజలి ఇది.. మన వీరులను మన ప్రజలను బలిగొంటున్న ‘ఆతతాయి’- టెర్రరిస్టు- పాకిస్తాన్ ప్రభుత్వ దుశ్చర్యలకు తగిన దండన ఇది. ఏడు దశాబ్దులలో పాకిస్తాన్ జిహాదీ ముష్కరులు వేలమంది సైనికులను, అనుబంధ సైనికులను, పోలీసులను, పౌరులను బలికొనడం చరిత్ర. 2015 నుంచి మన ప్రభుత్వం ఈ బీభత్స చరిత్రను నిరోధిస్తోంది.. పాకిస్తానీ జిహాదీ తండాలను ఎప్పటికప్పుడు శిక్షిస్తోంది. ఆధీనరేఖను దాటి వచ్చిన ముష్కరులను మాత్రమే కాక, పాకిస్తాన్‌లో పొంచివున్న బీభత్సపు తోడేళ్లను సైతం మట్టుబెట్టడానికి మన ప్రభుత్వం నడుం బిగించి ఉండడం గత ఐదేళ్లుగా ఆవిష్కృతవౌతున్న రక్షణ దృశ్యం.. మన ప్రభుత్వం ఇలా బీభత్స వ్యతిరేక పటిష్ఠ చర్యలను నిర్వహిస్తుండడం వల్ల అంతర్జాతీయ సమాజం కూడ పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వరూపాన్ని క్రమంగా గుర్తిస్తోంది! ఈ అంతర్జాతీయ అభిశంసనను తప్పించుకొనడంలో భాగంగానే పాకిస్తాన్‌లోని లాహోర్ ప్రత్యేక న్యాయస్థానం గురువారంనాడు ‘హఫీజ్ సరుూద్’కు ఐదున్నర సంవత్సరాల కారాగృహ శిక్షను విధించింది!!
హఫీజ్ సరుూద్ ఐక్యరాజ్యసమితి నిర్థారించిన అంతర్జాతీయ బీభత్సకారుడు. ‘లష్కర్ ఏ తయ్యబా’ అన్న బీభత్సపు ముఠాను ప్రారంభించి మనదేశాన్ని ‘బద్దలు కొట్టే లక్ష్యాన్ని’’ సాధించడానికి యత్నించినవాడు! లష్కర్ ఏ తయ్యబా- ఎల్‌ఇటి- బీభత్సకాండ అంతర్జాతీయ ‘కుఖ్యాతం’ కావడంలో ఐక్యరాజ్యసమితి ఒత్తిడికి లొంగిన పాకిస్తాన్ ప్రభుత్వం ‘లష్కర్ ఏ తయ్యబా’ను నిషేధించవలసి వచ్చింది! వెంటనే హపీజ్ సరుూద్ ‘జమాత్-ఉద్-దావా’ అన్న మరో బీభత్స సంస్థను ప్రారంభించాడు! ఈ బీభత్సపు ముఠా వారే 2008 నవంబర్‌లో మన ముంబైలో భయంకర హత్యాకాండ సాగించారు! ఈ బీభత్సకాండకు నూట అరవై ఆరుమంది బలయ్యారు. వందలమంది క్షతగాత్రులయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు మన ప్రభుత్వం పదే పదే కోరినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం ‘హఫీజ్ సరుూద్’ అన్న ఈ పైశాచిక బీభత్సకారుడిని మనకు అప్పగించలేదు.. కనీసం తమ దేశంలో కూడ శిక్షించలేదు. ‘జమాత్ ఉద్ దావా’- జెయుడి-ను నిషేధించాలని, హఫీజ్‌ను నిర్బంధించి విచారించాలని 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానాన్ని అమలుజరిపినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ‘జమాత్’ను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించలేదని 2009 జూలైలో లాహోర్ హైకోర్టు నిర్థారించింది. ఫలితంగా గృహ నిర్బంధంలో ఉండిన హఫీజ్ సరుూద్‌ను లాహోర్ హైకోర్టు విడుదల చేసింది. అలా పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని వంచించింది. ఈ వంచన క్రీడ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది!
హఫీజ్ సరుూద్‌ను గృహ నిర్బంధంలో ఉంచడం, మళ్లీ విడుదల చేయడం ఈ వంచన క్రీడలో భాగం. ఇపుడు హఫీజ్ సరుూద్‌ను పాకిస్తాన్‌లోని లాహోరు ప్రత్యేక న్యాయస్థానం రెండు అభియోగాలలో దోషిగా నిర్థారించింది. ఒక్కొక్క ‘కేసు’లో ఐదున్నర ఏళ్లు ‘జైలు’శిక్షను పదిహేను వేల రూపాయల జరిమానాను విధించింది. అయితే ఈ రెండు అభియోగాలు కూడ ముంబయిలో జిహాదీలు జరిపిన బీభత్సకాండకు సంబందించినవి కావు. బీభత్సకారులకు హఫీజ్ సరుూద్ ఆర్థిక సహాయం చేస్తున్నాడన్నది ధ్రువపడిన అభియోగాలు! ఈ రెండు శిక్షలు ఒకేసారి అనుభవించాలని న్యాయస్థానం నిర్దేశించింది కనుక సరుూద్ ఐదున్నర ఏళ్లు మాత్రమే జైలులో ఉండవలసివస్తోంది! హత్యానేరం నుంచి తప్పించుకొనడానికి వీలుగా ‘జేబు దొంగతనం’ నేరానికి శిక్షను పొందడం నేరస్థుల ఎత్తుగడ! పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఎత్తుగడకు పాలుపడింది. ముంబయి హత్యాకాండ జరిపించిన నేరానికి ఈ హఫీజ్ సరుూద్ అనే పిశాచానికి కనీసం యావజ్జీవ కారాగృహ శిక్షను విధించాలి! కానీ ఈ పెద్ద నేరం గురించి భయంకర నేరం గురించి పాకిస్తాన్ ప్రభుత్వం కాని, న్యాయస్థానాలు కాని పట్టించుకోవడంలేదు. నిజానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ‘ఆర్థిక కార్యాచరణ నిఘాదళం’ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ -ఎప్‌ఎటిఎఫ్- పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న పరిశోధన సరుూద్ వ్యతిరేక చర్యకు కారణం! పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ జిహాదీ బీభత్స సంస్థలకు నిధులు లభించడానికి మాధ్యమంగా మారింది. సౌదీ అరేబియా తదితర దేశాలలోని ‘జిహాద్’ సమర్థక సంపన్నులు ఈ నిధులను సమకూర్చుతున్నారు. ఈ సంగతి ఎఫ్‌ఏటిఎఫ్ పరిశోధనలో ధ్రువపడింది. అందువల్ల పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షలు విధించడానికి ‘సమితి’ పూనుకొంటోంది! ఈ ఆంక్షలను తప్పించుకొనడానికై పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం పన్నిన పన్నాగంలో భాగం హఫీజ్ సరుూకు ఈ ‘నామమాత్రపు’ శిక్ష విధించడం..
పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండకు పుల్వామా -అవన్తీపురాలో మన జవానులు బలైపోయి సరిగ్గా ఏడాది గడిచింది..
వారి త్యాగనిరతి చూసి..
ఒక కంట ఆనందాశ్రువు..
అమరుల ఎడబాటు తలచి
మరోకంట శోకజలము..
హర్షవ్యథా సంగమస్థితి
ఆవహించె భారతి మది
ఎదకందని భావాలను
శ్రుతి చేస్తూ ఉంది జాతి!!

9, ఫిబ్రవరి 2020, ఆదివారం

పాకిస్తాన్‌లో ‘వ్యవస్థ’

Published Saturday, 4 January 2020
పాకిస్తాన్‌లోని ‘అల్పసంఖ్య’ మతాల ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తున్న వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరసించడం హర్షణీయం. దశాబ్దుల తరబడి పాకిస్తాన్‌లోని హిందువులపై జరుగుతున్న అత్యాచారాలను గురించి, హత్యాకాండను గురించి మన ప్రభుత్వాలు పట్టించుకొనకపోవడం చరిత్ర. నరేంద్ర మోదీ ఇప్పుడు పట్టించుకున్నాడు. పట్టించుకోవలసిందిగా కాంగ్రెస్ పార్టీకి సలహా కూడ ఇచ్చాడు. పాకిస్తాన్‌లో ‘అల్పసంఖ్య మతాల’వారిపై జరుగుతున్న దౌర్జన్యకాండను నిరసించాలని కాంగ్రెస్‌కు సలహా ఇచ్చాడు! 1947 ఆగస్టు 15వ తేదీన పాకిస్తాన్‌లో ‘అల్పసంఖ్య’ ప్రజలుగా మారిన ‘హిందూ మతాల’ వారిపై అప్పటి నుంచి ఇప్పటివరకు జిహాదీలు ఘోరమైన అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. ఈ అత్యాచారాలకు, హత్యాకాండకు రెండున్నర లక్షల మంది బలైపోవడం చరిత్ర! తప్పించుకున్న దాదాపు ఎనబయి లక్షల మంది హిందూ మతాల వారు 1947వ, 1948వ సంవత్సరాలలో మన దేశంలోకి శరణార్థులుగా వచ్చేశారు. ఫలితంగా 1947వ సంవత్సరం నాటి పాకిస్తాన్ జనాభాలో ఇరవై నాలుగు శాతం ఉండిన హిందూ మతాల వారి సంఖ్య 1948 నాటికి ఒకటిన్నర శాతానికి పడిపోయింది. 1947లో పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలో క్రీస్తుశకం 712 నాటికి వంద శాతం ప్రజలు హిందువులే! 1947 నాటికి హిందూ మతాల వారి సంఖ్య ఇరవై శాతానికి దిగజారిపోవడానికి కారణం స్పష్టం! 712లో విదేశాల నుంచి ‘ఇస్లాం’ ‘అఖండ భారత్’లో ప్రవేశించింది. పాకిస్తాన్‌గా ఆ తరువాత ఏర్పడిన ‘అఖండ భారత్’ ప్రాంతంలో ఇస్లాం మతస్థుల సంఖ్య డెబ్బయి నాలుగు శాతం కావడానికి దారితీసిన చారిత్రక నేపథ్యం కూడ స్పష్టం!! మొదట అరబ్బీ జిహాదీలు కొన్ని వేల మంది హిందూ మతాల వారిని ‘ఇస్లాం’లోకి బలవంతంగా మార్చారు. అలా మారినవారు తరువాతి తరంలో మరికొన్ని లక్షల మంది హిందూ మతాల వారిని ‘ఇస్లాం’లోకి మార్చారు. ఇలా అనేక తరాలపాటు దాదాపు పనె్నండు వందల ఏళ్లపాటు మతం మార్పిడులు జరిగాయి. ఫలితంగా 1947లో పాకిస్తాన్‌గా ఏర్పడిన ‘అఖండ భారత్’ ప్రాంతంలో ‘ఇస్లాం’ జనాభా పెరిగింది! అనాదిగా అక్కడ నివసించిన హిందూ మతాల వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది! వేద మతాలు బౌద్ధం, జైనం, సిక్కు మతం వంటివి ఈ అనాది స్వజాతీయ హిందూ మతాలు! ఎన్ని మతాలు ఉండినప్పటికీ ‘అఖండ భారత్’లో సర్వమత సమభావ వ్యవస్థ వికసించింది. విదేశాల నుంచి ‘ఇస్లాం’ప్రవేశించిన తరువాత కూడ ఈ వ్యవస్థ భంగపడలేదు! కానీ ‘జిహాదీ’లు ఈ ‘సర్వమత సమభావ వ్యవస్థ’ను అంగీకరించలేదు. ఎందుకంటె అన్ని ఇతర మతాలను నిర్మూలించి ‘ఇస్లాం’ను ఏకైక మతంగా ప్రతిష్టించడం జిహాదీల లక్ష్యం... ఈ లక్ష్య సాధనలో భాగంగానే ఆ తరువాత ‘పాకిస్తాన్’గా ఏర్పడిన అఖండ భారత ప్రాంతంలో ‘జిహాదీ’లు 712 నుంచి శతాబ్దుల పాటు ‘‘ఇస్లామేతర’’ మతాల వారిని నిర్మూలించారు. 1947 నాటికి ఆ ప్రాంతంలో ఇస్లాం మతస్థుల సంఖ్యాధిక్యం ఏర్పడడానికి ఇదీ కారణం! సర్వమత సమభావ వ్యవస్థకూ, జిహాదీ ఏకమత ఉన్మాద లక్ష్యానికీ మధ్య జరిగిన శతాబ్దుల పోరాటంలో ‘సర్వమత సమభావ వ్యవస్థ’ ఓడిపోయింది. ఓడిపోయినచోట పాకిస్తాన్ ఏర్పడింది!
‘సర్వమత సమభావ వ్యవస్థ’ మిగిలిన ప్రాంతం ‘అవశేష భారత్’గా కొనసాగుతోంది! ఇదీ పాకిస్తాన్‌కూ మన దేశానికీ మధ్యకల తేడా!! ఇక్కడ సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ ఉంది. అందువల్ల ‘ఇస్లాం’ సహా అన్ని మతాలవారు ఇక్కడ హాయిగా జీవిస్తున్నారు. అక్కడ -పాకిస్తాన్‌లో- సర్వమత సమభావ వ్యవస్థ లేదు, ‘ఇస్లాం’ ఏక మత రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడి ఉంది. అందువల్ల ‘‘ఇస్లాం మతేతరులు’’ అక్కడ బతికి బట్టకట్టలేకపోతున్నారు! 1948 నాటికి - మన దేశానికి ఎనబయి లక్షల మంది హిందువులతో పారిపోయి వచ్చేసిన తరువాత- మిగిలిన ఒకటిన్నర శాతం హిందువులను ‘సున్న శాతం’ చేయడానికి ‘జిహాదీ’లు యత్నిస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్‌లో కూడ ఇదే రీతిలో ఇస్లామేతరులను నిర్మూలించే కార్యక్రమం నడుస్తోంది. అఫ్ఘానిస్థాన్‌లో ‘హైందవ నిర్మూలనం’ దాదాపు పూర్తయింది! ఇదంతా ‘అఖండ భారత’ విభజన వల్ల సంభవించిన వైపరీత్యం. దేశ విభజనకు అంగీకరించి, అఖండ భారతదేశపు భూభాగంలో దాదాపు మూడవ వంతు పాకిస్తాన్‌గా ఏర్పడడానికి, పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలో ‘సర్వమత సమభావ సమాజం’ అంతరించిపోవడానికి దోహదం చేసింది ‘కాంగ్రెస్ ఉద్యమ సంస్థ’! కాంగ్రెస్ ఉద్యమ సంస్థ ‘రాజకీయ రూపం’ దాల్చి 1947 నుంచి దశాబ్దుల పాటు దేశాన్ని పాలించింది. అందువల్ల కాంగ్రెస్‌కు బాగా తెలుసు... నిన్న, నేడు పాకిస్తాన్ నుంచి ఇస్లామేతరులు మన దేశానికి శరణార్థులై వస్తుండడానికి కారణం పాకిస్తాన్‌లోను మిగిలిన రెండు దేశాల- అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌లు-లోను ‘సర్వమత సమభావ వ్యవస్థ’ నశించడం!
ఇలా శరణార్థులై వచ్చినవారికి మన దేశం పౌరసత్వం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ వారు, ఇతర ప్రతిపక్షాల వారు పాకిస్తాన్‌లో ‘మైనారిటీ’లపై జరుగుతున్న అత్యాచారాలను, హత్యాకాండను పట్టించుకోవడం లేదు, దశాబ్దులుగా పట్టించుకోలేదు!! ఇదంతా దేశ విభజనతో, అఖండ భారత్ విభజనతో ముడివడి ఉన్న సమస్య కనుక పాకిస్తాన్‌లోని, మిగిలిన రెండు దేశాలలోని ‘అల్పసంఖ్య’ మతాల వారి గురించి పట్టించుకోవడం మన ప్రభుత్వాల, రాజకీయ పక్షాల నైతిక బాధ్యత మాత్రమే కాదు దౌత్య ధర్మం కూడ! పాకిస్తాన్‌లోను, అఫ్ఘానిస్థాన్‌లోను, బంగ్లాదేశ్‌లోను సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడినట్టయితే ఆ దేశాలలోని ‘అల్పసంఖ్య’ మతాల వారు అక్కడనే జీవించగలరు, పారిపోయి మన దేశానికి రావలసిన అవసరమే ఉండదు. జమ్మూ కశ్మీర్‌లో అక్రమంగా జోక్యం కలిగించుకొనడానికి పాకిస్తాన్ పదే పదే యత్నిస్తోంది! జమ్మూ కశ్మీర్‌లో మన ప్రభుత్వం ప్రజల ‘‘మానవ అధికారాల’’కు భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం దాదాపు ప్రతి సంవత్సరం ‘ఐక్యరాజ్యసమితి’లో తీర్మానాన్ని ప్రతిపాదిస్తోంది. తీర్మానాలు వీగిపోవడం వేఱు... కానీ కశ్మీర్‌లో మన ప్రభుత్వం ప్రజల హక్కులకు భంగం కలిగించడం లేదు. ‘‘జరగని’’ హక్కుల ఉల్లంఘన ‘‘జరిగినట్టు’’గా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచారం చేయగలగడం ప్రస్తుతాంశం! అలాంటిది పాకిస్తాన్‌లో దశాబ్దుల తరబడి ‘మైనారిటీ’-అల్పసంఖ్య-మతాల ప్రజలకు జరుగుతున్న ఘోరమైన అన్యాయాల గురించి మన ప్రభుత్వం ‘ఐక్యరాజ్యసమితి’లో ఎందుకని ఫిర్యాదు చేయడం లేదు? ఇలా ఫిర్యాదు చేయడం జరిగితే పాకిస్తాన్‌లో ‘మైనారిటీ’లు అనుభవిస్తున్న కడగండ్ల గురించి ప్రపంచ సమాజానికి తెలిసి వస్తుంది! దక్షిణ ఆఫ్రికా వంటి దేశాలలో ‘వర్ణవివక్ష’ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రపంచ సమాజం ఇస్లాం మత రాజ్యాలను ‘సర్వమత సమభావ వ్యవస్థ’లుగా ఏర్పడాలని కోరాలి, ఇందుకోసం కృషి చేయాలి! ఇందుకు ప్రధానంగా పూనుకోవలసింది మన ప్రభుత్వం...
మన దేశంలోని అనేక రాజకీయ పక్షాల వారు వివిధ దేశాల అంతర్గత వైపరీత్యల గురించి అప్పుడప్పుడు ఆర్భాటం చేస్తున్నారు. ఇదంతా మానవీయ కార్యక్రమం... కానీ పాకిస్తాన్‌లోను, బంగ్లాదేశ్‌లోను ‘అల్పసంఖ్య’ ప్రజలపై జరుగుతున్న బీభత్సకాండ గురించి ఈ పక్షాలు నోరెత్తడం లేదు. ప్రధానమంత్రి గురువారం కాంగ్రెస్ పార్టీకి చెప్పిన హితవుకు ఇదీ నేపథ్యం... పాకిస్తాన్‌లోని హిందువుల కడగండ్ల గురించి 2012 మే నెల రెండవ తేదీన భారతీయ జనతాపార్టీ నాయకుడు మురళీమనోహర్ జోషి లోక్‌సభలో ప్రస్తావించాడు. అప్పటి విదేశాంగ మంత్రి ఎస్.ఎమ్.కృష్ణ ‘మైనారిటీ’లను రక్షించవలసిందిగా పాకిస్తాన్‌కు ‘సభలో’ విజ్ఞప్తిచేశాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఈ సంగతి గుర్తుకు వచ్చిన దాఖలా లేదు... నరేంద్ర మోదీ ప్రతిపక్షాలకు చేసిన విజ్ఞప్తికి ఇదీ కారణం! పాకిస్తాన్ తీరును ప్రతిపక్షాల వారు ఇప్పుడైనా నిరసిస్తారా?

రాజధాని రభస..

Published Tuesday, 24 December 2019
వికేంద్రీకరణ- డీసెంట్రలైజేషన్- అని అంటే విచ్ఛిత్తి- డిస్ ఫిగర్‌మెంట్- కాదు, కారాదు! అలాగే అభివృద్ధి అని అంటే ‘ఆర్భాటం’కాదు, కారాదు! ‘ఆడంబరత్వం’ సమృద్ధి కాజాలదు!! 2014వ సంవత్సరంనుంచి ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఆర్భాటాన్ని ప్రస్ఫుటింప చేయడం చరిత్ర. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని ‘‘అమరావతి’’ కేంద్రంగా ఈ ఆడంబరత్వాన్ని ప్రదర్శించింది. ‘అంతర్జాతీయ స్థాయి’అన్నది ఈ ఆడంబరత్వం!! తెలుగువారి నిర్మాణ సంప్రదాయాలను, భారత జాతీయ కళారీతులను ఈ ‘అంతర్జాతీయ ఆడంబరత్వం’ దిగమింగడానికి యత్నించడం ఐదేళ్ల చరిత్ర! తొమ్మిది రంగాలకు చెందిన తొమ్మిది నగరాలను ‘అమరావతి’లో కుప్పేయడం, కూరేయడం ‘అంతర్జాతీయ స్థాయి’గా తెలుగుదేశం ప్రభుత్వం ప్రచారం చేసింది!! ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు సగం జనాభా ‘అమరావతి’ ప్రాంగణంలోనే కేంద్రీకృతం కావడం ఖాయమన్న ‘్భవం’లేదా ‘భ్రాంతి’ కలగడం ఆ ఐదేళ్ల చరిత్ర. జన కేంద్రీకరణ కాలుష్య కేంద్రీకరణకు వాహనాల కేంద్రీకరణకు ‘‘రణగొణ’’ధ్వనుల కేంద్రీకరణకు దోహదం చేయడం మన నగరాలలోని వారికి ప్రత్యక్ష అనుభవం! అందువల్ల ‘కేంద్రీకరణ’ వైపుగా కాక ‘‘వికేంద్రీకరణ’’ వైపు ప్రగతి ప్రస్థానం జరగాలన్నది స్వచ్ఛ రాజధానిని, స్వచ్ఛ ప్రాంతాలను, స్వచ్ఛ భారత్‌ను అభిలషించేవారి అభిమతం! ‘వికేంద్రీకరణ’వల్ల కాలుష్యం తగ్గుతుంది, ప్రాకృతిక హరిత పరిమళాలు నగరాలలో, పట్టణాలలో, పల్లెలలో ప్రాంతాలలో దేశమంతటా సభలు తీరుతాయి!! అందువల్ల ‘వికేంద్రీకరణ’ అభిలషణీయమే!! వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిత్వంలోని ‘వైఎస్ఆర్ కాంగ్రెస్’ ప్రభుత్వం ‘వికేంద్రీకరణ’చేయగలిగితే అది హర్షణీయ పరిణామం కాగలదు. కానీ ‘వికేంద్రీకరణ’అంటే విడగొట్టడం కాదు, విచక్షణ రహితమైన వెదజల్లడం కాదు. నలుగురు వ్యక్తులు ‘‘ఒకేచోట ఒకే పని’’చేయడం కేంద్రీకరణ కావచ్చు. ఈ నలుగురూ అదే అదే పనిని నాలుగుచోట్ల చేయడం వికేంద్రీకరణ! నాలుగు నూనె గానుగలను ఒకే పల్లెలో నెలకొల్పడం ‘కేంద్రీకరణ’! నాలుగు పల్లెలలో వీటిని నెలకొల్పడం ‘వికేంద్రీకరణ’! కానీ ఒక వ్యక్తి అవయవాలను విడగొట్టి నాలుగు మూలలకూ విసిరివేయడం ‘వికేంద్రీకరణ కాదు’- అది విచ్ఛిత్తి మాత్రమే!! ‘నూనె గానుగ’ రోలును ఒకచోట, ‘రోకలి’ని మరోచోట, నడిపించే వృత్తికళాకారుడిని మరోచోట దూరదూరంగా ప్రతిష్ఠించడం ‘వికేంద్రీకరణ’ కాదు... అది వికృతమైన ఉన్మాదం మాత్రమే!! ‘కంప్యూటర్’ సిస్టమ్‌లోని ‘మదర్‌బోర్డు’ను ఒకచోట, ‘మానిటర్’ను మరోచోట, ‘కీబోర్డు’ను వేరొకచోట దూరదూరంగా నెలకొల్పడం వికేంద్రీకరణ కాదు... మహమ్మద్‌బిన్ తుగ్లక్ నాటి చరిత్రకు పునరావృత్తి మాత్రమే కాగలదు!! అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజధానిని సమన్వయ స్థితంగా వికేంద్రీకరించవచ్చు... కాని విచక్షణ రహితంగా విడగొట్టడం రాజకీయ విజ్ఞత కాజాలదు!!
దేశంలో ఏ ప్రాంతానికి కూడ రెండు మూడు రాజధానులు లేవు. జమ్మూకశ్మీర్‌కు మాత్రమే- వాతావరణంలో వచ్చే విపరీతమైన మార్పులు కారణంగా- రెండు రాజధానులున్నాయి. ‘హేమంత’ రాజధాని జమ్మూ నగరం, ‘వసంత’ రాజధాని శ్రీనగరం. చలికాలం-హేమంతం-లో శ్రీనగరంలో భరింపరాని చలి ఉండడంవల్ల ‘పాలనా యంత్రాంగాన్ని’- దర్బార్‌ను- జమ్మూకు తరలిస్తున్నారు. కానీ దీనివల్ల, ఈ తరలింపువల్ల రెండు వారాలపాటు పాలన వ్యవస్థ స్తంభించిపోతోందట. అందువల్ల ఈ ‘దర్బార్’ తరలింపునకు స్వస్తిచెప్పి, శ్రీనగర్‌నుంచే చలికాలంలో కూడ పాలన జరగాలన్న ‘కోరిక’ తరచు వినిపిస్తోంది! రాష్ట్ర సచివాలయం, విధానమండలి, మంత్రివర్గం, రాజ్యపాల్ నివాసమైన ‘రాజ్‌భవన్’ ఒకేచోట ఉండడం అన్ని రాష్ట్రాలలోను కొనసాగుతున్న రాజ్యాంగ వ్యవస్థ, ఇలా ఈ ‘విభాగాలు’ ఏర్పడిన నగరాన్ని మాత్రమే రాజధాని అంటున్నారు. శాసన నిర్మాణం- శాసనసభ లేదా శాసనసభ, శాసన మండలి కలసిన ఉభయ సభల విధానమండలి- ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలోని మొదటి విభాగం! రెండవ విభాగం కార్యనిర్వహణ విభాగం, ఇదే మంత్రివర్గం, సచివాలయం! అధ్యక్ష పాలన ఉన్న ప్రజాస్వామ్యంలో ఈ రెండు విభాగాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా సర్వస్వతంత్రంగా ఏర్పడి ఉన్నాయి. అది వేఱు! కానీ మన దేశంలో కేంద్రీయ స్థాయిలోను, ప్రాంతీయ స్థాయిలోను ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ’ ఏర్పడిఉంది. కార్యనిర్వహణ విభాగం, శాసన నిర్మాణ విభాగం పరస్పరం ముడివడి ఉండడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య లక్షణం! మంత్రివర్గం పార్లమెంటులోను, విధాన మండలిలోను సభ్యులుగా ఉండడం ఈ ‘ముడి’...శాసన నిర్మాణ విభాగం విశ్వాసం- మద్దతు- ఉన్నంతవరకే కార్యనిర్వహణ విభాగం అధికారంలో ఉంటుంది! శాసన నిర్మాణ విభాగం -చట్టసభలు- చర్చించి ఆమోదించే అధికార ‘ప్రతిపాదన’ల- అఫిషియల్ బిల్లుల-ను మంత్రివర్గం రూపొందిస్తున్నారు. చట్టసభలలో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పాలి. చర్చలలో ప్రధాన పాత్రధారులు మంత్రులే. అందువల్ల ఈ రాజ్యాంగ ప్రక్రియ సజావుగా జరగాలంటే చట్టసభలు ఉన్నచోటనే, అదే నగరంలో, సచివాలయం కూడ ఉండాలి! సచివాలయం ఉన్నచోటనే మంత్రివర్గం అధికార నివాసాలు ఉండాలి! ఇది సహజమైన రాజ్యాంగ సమీకృతి!!
ఈ సమన్వయ సమీకృతికి విరుద్ధంగా సచివాలయాన్ని విశాఖ పట్టణంలోను, చట్టసభల భవనాలను అమరావతిలోను ఏర్పాటుచేయడం వికేంద్రీకరణ కాదు, రాజ్యాంగ ప్రక్రియకు విఘాతం మాత్రమే కాగలదు. సచివాలయాన్ని రాజ్‌భవన్‌ను అమరావతిలో కట్టి, చట్టసభలను విశాఖపట్టణంలో కట్టినప్పటికీ ఇదే విఘాతం ఏర్పడుతుంది! బుద్ధి, హృదయం ఒకే దేహంలో ఉన్నట్టు శాసన నిర్మాణ విభాగం, కార్యనిర్వహణ విభాగం ఒకే ‘ఊరి’లో ఉండాలి! ఇలా అమరిన తరువాత రాజధానిలోకాక మరోచోట సంవత్సరానికోసారి శాసనసభ సమావేశాలు జరుపుకోవచ్చు. మహారాష్ట్ర రాజధాని ముంబయి, నాగపూర్‌లో కూడ ఏడాదికోసారి శాసనసభ సమావేశాలు జరుపుతున్నారు. అందువల్ల శాసనసభ, శాసన మండలి, సచివాలయం, మంత్రుల నివాసాలు, రాజ్‌భవన్‌లను ఒకేచోట అమరావతిలోనే ఏర్పాటుచేయాలి! అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంది!! దక్షిణపు కొసన ఉన్న ప్రజలకూ ఉత్తరపు కొసన ఉన్న ప్రజలకూ కూడ ఇది జీవన సౌలభ్యం! విశాఖపట్టణంలో ఉన్నత న్యాయస్థానం ఏర్పాటుచేయండి, దానికి అనుబంధంగా ‘ఉన్నత న్యాయపీఠాన్ని’ -హైకోర్ట్ బెంచ్‌ని- కర్నూలులో పెట్టండి. లేదా ఉన్నత న్యాయస్థానాన్ని కర్నూలులో ఏర్పాటుచేసి ‘విశాఖ’లో ఉన్నత న్యాయ పీఠాన్ని పెట్టండి. రాజధాని నగరంలోనే ‘హైకోర్టు’ ఉండవలసిన అనివార్యం లేదు. కృష్ణానదికి దక్షిణంగా ఉన్న ప్రాంతానికి కర్నూలు ఉన్నత న్యాయస్థానం సౌలభ్యం... కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న ప్రాంతానికి ‘విశాఖ’ ఉన్నత న్యాయస్థానం సౌకర్యవంతం... ఏమయినప్పటికి ఉన్నత న్యాయస్థానం ఉన్న నగరం రాజధాని కాజాలదు. అది ఉన్నత న్యాయాలయ స్థానం- సీట్ ఆఫ్ హైకోర్ట్- మాత్రమే కాగలదు... దేశమంతటా ఇదే తీరు!!
ఇలా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించవచ్చు!! రాజధాని పరిపాలన నగరంగా చిన్న నగరంగా స్వచ్ఛ నగరంగా అడ్డంగా విస్తరించాలి! భవనానికీ భవనానికీ మధ్య తోటలు, చెట్లు, పొలాలు... తోటలకు మధ్యలో భవనాలు! ఇదీ ‘హరిత నగర’ నిర్మాణ వైఖరి. క్రీస్తుశకం పదునాలుగవ, పదహైదవ, పదహారవ శతాబ్దులనాటి ‘హంపీ విజయనగరం’ ఇలాంటి ‘హరిత’రాజధాని!!! భారతదేశపు చరిత్రను అధ్యయనం చేయాలి, ఆదర్శాలను స్వీకరించి ఆచరించాలి!! దక్షిణ ఆఫ్రికాను, ఉత్తర కొరియాను అనుకరించడం ‘హంస’కాకిని అనుసరించినట్టు కాగలదు!! వికేంద్రీకరణ అంటే ‘సమీకృతి’ని ‘రాజ్యాంగ ప్రక్రియ స్వరూపాన్ని’ చెడగొట్టడం కాదు!! వాణిజ్య నగరాన్ని, క్రీడా నగరాన్ని, విద్యానగరాన్ని, చిత్ర నగరాన్ని, రకరకాల విచిత్ర నగరాలను అమరావతిలో కట్టకండి... వివిధ నగరాలలో పట్టణాలలో కట్టండి!! వికేంద్రీకరణ అంటే ఇది... ప్రాచీన భారతంలో రాజధానులు విద్యాకేంద్రాలు, వాణిజ్య కేంద్రాలు, కళాకేంద్రాలు, తీర్థయాత్రా స్థలాలు కాలేదు!! ఈ వివిధ రంగాల కేంద్రాలు దేశమంతటా- రాజధానులకు దూరంగా- విస్తరించి ఉండేవి!! అదీ వికేంద్రీకరణ!!

‘విషం కక్కిన’ మమత!


మన ధేశపు అంతర్గత వ్యవహారాలలో ‘ఐక్యరాజ్యసమితి’ అక్రమ ప్రమేయం కల్పించుకోవాలని పిలుపునివ్వడం దేశ విద్రోహకరమైన దుశ్చర్య. మమతాబెనర్జీ ఈ దుశ్చర్యకు పాలుపడింది! దేశ విద్రోహకర చర్యలకు పాలుపడినప్పటికీ తమకు ఎలాంటి హాని జరగదని అనేక దశాబ్దులపాటు ‘జమ్మూకశ్మీర్’లో కొందరు స్థానిక రాజకీయవేత్తలు విశ్వసించారు. ఇలాంటి రాజకీయ వేత్తలు గతంలో ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం చరిత్ర... షేక్ అబ్దుల్లా క్రీస్తుశకం 1950వ దశకంలో ఇలాంటి ప్రకటనలను చేశాడు, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు, కారాగృహ నిర్బంధానికి గురిఅయ్యాడు. ఈ చరిత్రను పునరావృత్తం చేయడానికి బెంగాల్‌లో మమతాబెనర్జీ బహుశా ఇప్పుడు నడుం బిగించింది. ‘పౌరసత్వ సవరణ చట్టం’ రాజ్యాంగ నిబద్ధత గురించి దేశంలో ‘జనాభిప్రాయ సేకరణ’- రెఫరెండం-జరగాలని మమతాబెనర్జీ పిలుపునిచ్చింది. అయితే ఈ ‘జనాభిప్రాయ సేకరణ’ ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో జరగాలని కూడ ఆమె కోరడం దేశద్రోహకరం... భారత రాజ్యాంగ గరిమకు అవమానకరం! పశ్చిమ బెంగాల్ ‘శాసనసభ’కు 2021లో జరుగనున్న ఎన్నికలలో తమ పార్టీ పరాజయం పాలుకాక తప్పదన్న ‘విశ్వాసం’ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘తృణమూల్ కాంగ్రెస్’ అధినేత్రి మమతాబెనర్జీకి ఏర్పడింది. ఈ ‘విశ్వాసం’ నిజానికి భయం, ఆందోళన! ‘అధికారచ్యుతి’ని తలచుకొని ఆమె హడలెత్తిపోతోంది!! ఆమె అంతరంగం కల్లోల తరంగమయం... ఈ ఏడాది మే నెలలో ముగిసిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ ‘బెంగాల్ దీదీ’కి ఈ ‘పరాజయ విశ్వాసం’ దృఢపడింది. పరాజయాన్ని తప్పించుకొనడానికై ఆమె అమలు జరుపుతున్న వ్యూహంలో భాగం ‘పౌరసత్వ సవరణ చట్టం’- సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్- సిఏఏ- పట్ల తీవ్ర వ్యతిరేకత!! ‘చట్టం’పట్ల వ్యతిరేకత ‘‘దేశం పట్ల విద్రోహం’’గా పరిణమించడం నిన్న నేడు జరుగుతున్న కథ. అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో సర్వమత సమభావ- సెక్యులర్- రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమైపోవడం ‘అఖండ భారత’ విభజనతో ముడివడిన పరిణామక్రమం. 1947లోను, అంతకు పూర్వం వివిధ సమయాలలోను అఖండ భారత విభజన జరిగింది. అనాదిగా ‘సర్వమత సమభావం’ జీవన స్వభావమైన స్వజాతీయులు- హిందువులు- ఈ మూడు ‘దేశాల’లోను ‘అల్పసంఖ్య’-మైనారిటీ- స్థాయికి దిగజారడం అఖండ భారత విభజనకు కారణం. ఇలా స్వజాతీయులైన హిందువుల సంఖ్య తగ్గి, విదేశాలనుంచి వచ్చిన ‘ఇస్లాం’లోకి మారిన వారి సంఖ్య పెరిగిన ఈ మూడు ప్రాంతాలు- అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్- ‘అఖండ భారత్’నుంచి విడిపోయాయి. క్రీస్తుశకం పనె్నండవ శతాబ్దినాటికే ‘అఫ్ఘానిస్థాన్’ అఖండ భారత్ నుంచి విడిపోయింది. ఈ మూడు దేశాలలోను ఇస్లాం ఏకమత ‘రాజ్యాంగ వ్యవస్థ’ ఏర్పడడంతో ‘అల్పసంఖ్య’లోని హిందువులు హత్యాకాండకు, లైంగిక అత్యాచారాలకు, మతం మార్పిడికి, తరిమివేతకు గురిఅవుతున్నారు, దశాబ్దులుగా గురిఅవుతున్నారు.
ఇలా తరిమివేతకు గురయి, ప్రాణావశిష్టులై శరణార్థులుగా మన దేశానికి వచ్చిన ఇస్లాం మతేతరులకు మానవీయ దృష్టితో ఆశ్రయం ఇవ్వడం మానవుల కర్తవ్యం. మానవులు కానివారు పైశాచిక ప్రవృత్తి కలవారు మాత్రమే ఈ నిస్సహాయ శరణార్థులకు భారతీయ పౌరసత్వం కల్పించే ఈ ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని’వ్యతిరేకిస్తున్నారు. ఇది మన దేశానికి సంబంధించిన వైపరీత్యం కాదు. ఎందుకంటె అనాదిగా అఖండ భారత్‌లోవలెనే 1947 తరువాత అవశేష భారత్‌లో- మన దేశంలో- కూడ సర్వమత సమభావ సామాజిక వ్యవస్థ కొనసాగుతోంది. మన దేశపు రాజ్యాంగం ఈ సనాతన వాస్తవానికి మరో ధ్రువీకరణ. అందువల్ల మన దేశంలో అల్పసంఖ్య మతస్థులైన ‘ఇస్లాం’, ‘క్రైస్తవ’, ‘పారశీక’, ‘యూదు’ వంటి జన సముదాయాల వారు తరిమివేతకు గురికాలేదు. కానీ ‘ఇస్లాం ఏకమత రాజ్యాంగ వ్యవస్థ’లు ఏర్పడిన పై మూడు దేశాలలోను ఇస్లామేతరులు- మైనారిటీలు- బీభత్సకాండకు, తరిమివేతకు గురిఅవుతున్నారు. సూర్యుని కాంతి స్పష్టంగా భాసిస్తున్నట్టుగా మన దేశంలోని సమాజానికీ, ఈ మూడు దేశాల సమాజాలకు మధ్య ఈ ‘అంతరం’ ప్రస్ఫుటిస్తోంది. వాస్తవాన్ని అంగీకరించనివారు సూర్యుని కాంతిని చూడలేని గుడ్లగూబలు!! అందువల్ల సవరణ చట్టం మన దేశంలో హాయిగా జీవిస్తున్న ఏ మతంవారికి కాని సంబంధించినది కాదు, ఏ మతం వారికీ వ్యతిరేకం కాదు!! కేవలం పై మూడు దేశాలనుంచి తరిమివేతకు గురిఅయిన ఆయా దేశాల ‘మైనారిటీ’లకు ప్రాణం నిలుపడానికి ఈ కొత్త చట్టం ఏర్పడింది. ఈ శరణార్థులు జీవించరాదా?? చట్టాన్ని వ్యితిరేకిస్తున్నవారు సమాధానం చెప్పాలి!
ఈ మూడు- అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్- దేశాలలోను ఇస్లాం మతస్థులు ‘మైనారిటీ’లు కాదు, వారు ఎవరి వేధింపులకు గురికాలేదు, తరిమివేతకు గురికాలేదు, శరణార్థులై మన దేశానికి రాలేదు. అందువల్లనే మన దేశంలో లేని ‘‘శరణార్థులకు’’ ఈ మూడు దేశాల ఇస్లాం మతస్థులకు మన దేశపు పౌరసత్వం కల్పించాలనడం అర్థంలేని కోరిక, మతిమాలిన వాంఛ! నిజమైన శరణార్థులకు మన దేశం మతంతో కాని జాతితో కాని సంబంధం లేకుండా అనాదిగా ఆశ్రయం కల్పిస్తోంది!! మహాకవి కరుణశ్రీ అన్నట్టు
‘‘అచ్చపు చీకటిండ్ల పొరలాడుచు
నుండ ప్రపంచమెల్ల ఈ
పచ్చని తల్లి గుమ్మములపై
వెలిగెన్ మణిదీపికల్, కనన్
వచ్చిన ఖండఖండముల వారికి
కోరిక తీరునట్టుగా
బిచ్చముపెట్టె భారత సవిత్రి
ప్రియంబున రెండు చేతులన్’’
పౌరసత్వ చట్టాన్ని సవరించడం ద్వారా మన ప్రభుత్వం ఈ భారత జాతీయ ‘మానవీయ పరంపర’ను నిలబెట్టింది. పైగా ఇప్పుడు ‘సవరణ చట్టం’ద్వారా భారతీయ పౌరసత్వం పొందుతున్నవారు ఒకప్పటి అఖండ భారత్‌లో సహజమైనవారు. బ్రిటన్ దుర్జనులు, ముస్లింలీగ్ మతోన్మాదులు ‘అఖండ భారత్’ను ముక్కలుచెక్కలు చేయకపోయి ఉండినట్టయితే ఇప్పుడు ఈ సవరణ చట్టం అవసరం ఉండేది కాదు. పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను చిత్రహింసలకు గురయి, మన దేశానికి శరణార్థులుగా వచ్చిన వస్తున్నవారికి న్యాయం చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడ హామీలనిచ్చింది! ‘‘పాకిస్తాన్‌లో ఓ హిందూ కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లను జిహాదీలు అపహరించారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు! ఆ ముగ్గురినీ జిహాదీలు- అదివరకే పెళ్లయి భార్యలున్నవారు- బలవంతంగా పెళ్లిచేసుకున్నారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టువారు ఆ దుండగులకు ఎలాంటి శిక్షనూ విధించలేదు. ఈ ముగ్గురు యువతులూ భర్తలతో కాపురం చేయవచ్చుననీ, ఇష్టం లేకపోతే పుట్టింటికి తిరిగి వెళ్లవచ్చునని పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది’’- ఈ దారుణ ఘటన గురించి 2012 మేలో ప్రచారమైంది. ఇది ఉదాహరణ మాత్రమే. ఇలాంటి బీభత్స ఘటనలు పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను ప్రతిరోజు జరుగుతున్నాయి. అందువల్లనే హిందువులు నిరంతరం ఈ దేశాలనుంచి నిష్క్రమించవలసి వస్తోంది!! ఇలాంటి దుస్థితికి పాకిస్తాన్‌లో కాని, బంగ్లాదేశ్‌లో కాని ఇస్లాం మతస్థులు గురికాలేదు, గురికావడం లేదు. అందువల్ల ఈ దేశాలనుంచి ఇస్లాం మతస్థులు శరణార్థులై మన దేశానికి రాలేదు. ‘‘లేని శరణార్థులకు’- మన దేశంలో లేని ముస్లిం శరణార్థులకు- మన దేశపు పౌరసత్వం ఎలా కల్పించగలం?? కానీ మమతాబెనర్జీ తక్షణ లక్ష్యం ఇది కాదు.
‘‘ఇలా దేశ విద్రోహకర ప్రకటనలను చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ కాలం సహించదు... అందువల్ల మమతాబెనర్జీ ప్రభుత్వాన్ని రద్దుచేసి బెంగాల్‌లో రాష్టప్రతి పాలన విధించవచ్చు!’’ అలా జరగాలన్నదే బహుశా మమతాబెనర్జీ కోరిక!! ఇలా ‘‘కూలిపోతే’’ తదుపరి శాసనసభ ఎన్నికలలో తమ పార్టీకి ప్రజల సానుభూతి పెరుగుతుందన్నది ఆమె వ్యూహం...

సౌరశక్తి ‘సౌరభం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సౌరశక్తి ప్రాధాన్యం పెరుగుతుండడం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన ‘ఆర్థిక సర్వేక్షణ’- ఎకనామిక్ సర్వే-కు అంతర్గత నేపథ్యం! ప్రభుత్వం సాధించ తలపెట్టిన ‘మూడు కోట్ల యాబయి లక్షల కోట్లు’ రూపాయల- ఐదు ట్రిలియన్ అమెరికా డాలర్ల- ఆర్థిక వ్యవస్థ ఎప్పటికి సాకారం అవుతుందన్న ప్రశ్నకు సమాధానం ప్రపంచీకరణ కబంధ బంధంనుంచి మనం బయటపడడం! ఇలా బయటపడే వరకు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ దళారీలు మన ‘పరపతి’ స్థాయి గురించి వ్యతిరేక నిర్ధారణలు చేస్తూనే ఉంటారు. మన స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదల వేగం తగ్గిపోతోందన్న బెదిరింపులను ఆవిష్కరిస్తూనే ఉంటాయి! ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’-గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- దాదాపు ఆరున్నర శాతం పెరగ గలదన్నది ‘ఆర్థిక సర్వేక్షణ’లోని ప్రధాన అంశం! ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి’- ఇంటర్ నేషనల్ మానిటరీ ఫండ్- ఐఎమ్‌ఎఫ్-, ‘ప్రపంచ బ్యాంకు’- వరల్డ్ బ్యాంక్- వంటి సంస్థలు, మన ‘జిడిపి’పెరుగుదల ఐదుశాతం కంటె తగ్గుతుందన్న నిర్ధారణలు చేశాయి. ఈ నిర్ధారణలను మన ప్రభుత్వం తోసిపుచ్చడం పెరుగుతున్న ఆర్థిక విశ్వాసానికి ప్రతీక! బాహ్యశక్తుల నిర్ధారణలు, బెదిరింపులను పట్టించుకోకుండా ‘అంతర్గత’ కృషి ద్వారా ఆర్థిక సౌష్టవాన్ని పెంచుకోవాలన్న ప్రభుత్వ విశ్వాసం ‘ఎకనామిక్ సర్వే’ ద్వారా ప్రస్ఫుటించింది. ఈ విశ్వాసం ప్రాతిపదికగా ఈ దశాబ్దిలోనైనా మన దేశం ‘ప్రపంచీకరణ’ మాయాజాలం నుంచి ఆర్థిక విముక్తిని సాధించాలి. అలా సాధించినప్పుడు మాత్రమే అంతర్గతమైన వనరుల ఆధారంగా మన ‘జిడిపి’ని పెంచుకోగలం. ఈ కర్తవ్య నిర్వహణలో మన ప్రభుత్వం ఎంతవరకు కృతకృత్యం కాగలదన్నది మన ‘జిడిపి’ పెరుగుదలకు ప్రాతిపదిక! ఈ దశాబ్ది-రానున్న పది ఏళ్లు- కర్తవ్య నిర్వహణ దశాబ్ది కావాలన్నది శుక్రవారం పార్లమెంటు సమావేశంలో ప్రసంగించిన రామనాథ కోవింద్ చెప్పిన హితవు. ‘ప్రపంచీకరణ’ వలయం నుంచి అమెరికా, బ్రిటన్ తదితర సంపన్న దేశాలు సైతం బయటపడడానికి యత్నిస్తున్నాయి. అందువల్ల మన దేశం కూడ ఈ కర్తవ్య నిర్వహణకు పూనుకోవాలి! విదేశాల పెట్టుబడులపై, భాగస్వామ్యంపై ఆధారపడకుండా అంతర్గత ఆర్థికబలం ప్రాతిపదికగా ప్రగతి సాధించగలమన్నది 2014వ సంవత్సరంనాటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘్భరతీయ జనతాపార్టీ’ చేసిన వాగ్దానం. ఆరేళ్లు గడిచాయి! దిగుమతులను గణనీయంగా తగ్గించుకొనడం ‘జిడిపి’ పెరుగుదలకు దీర్ఘకాల ప్రాతిపదిక... ఐదేళ్లు కావచ్చు పదిహేను ఏళ్లు కావచ్చు!! ఇంధన తైలం, ఇంధన వాయువుల దిగుమతులు తగ్గిపోవాలి! ఇందుకు అంతర్గత ప్రత్యామ్నాయం సౌర ఇంధనం వినియోగాన్ని పెంచడం...
సూర్యుడు మానవాళిని పెంపొందిస్తున్న సహజ జీవశక్తి... మానవులకు మాత్రమే సకల జీవజాలానికి ప్రాణశక్తి సూర్యుడు! వెలుగును వేడిమిని ప్రసాదిస్తున్న సూర్యుడు వర్షం కురిపిస్తున్నాడు, వర్షం ద్వారా ‘అన్నం’ తయారవుతోంది. ‘అన్నం’ జీవజాలానికి జవసత్వాలను ప్రసాదిస్తున్న అమృతం! అందువల్ల ‘‘సూర్యః ఆత్మా జగతః తస్థుషః’’- సూర్యుడు చరాచర జగత్తునకు ఆత్మ-అన్న సృష్టిగత వాస్తవాన్ని భారత జాతి అనాదిగా సమాజ జీవన స్థితం చేసుకొంది! ‘‘మిత్రః పృథివీం ఉతద్యాం దాధార’’- సూర్యుడు భూమిని అంతరిక్షాన్ని ధరించిన- వాస్తవాన్ని కూడ వేద ఋషులు, భారతీయులు అనాదిగా ఆవిష్కరించారు! ఈ సనాతన వాస్తవానికి ఆధునిక ఆవిష్కరణ సౌరశక్తి ద్వారా విద్యుచ్ఛక్తిని తయారుచేయడం. మన దేశం వంటి ‘సమశీతోష్ణ మండల’ భూమిపై నెలకొన్న దేశాల సూర్యుడు ఏడాది పొడవునా పుష్కలంగా కాంతిని ప్రసరింప చేస్తున్నాడు. అందువల్ల సూర్యుడికి కృతజ్ఞతలను తెలుపడం భారతీయ సమాజ నిహితమైంది. ‘సంధ్యావందనం’ సూర్యుని గతిపై ఆధారపడి ఉన్న మానవ జీవన ప్రక్రియ! సూర్యుడు బుద్ధిని ప్రచోదనం చేస్తున్నాడన్న వాస్తవం గాయత్రీ మంత్రం!! ఈ ఖగోళ, ప్రాకృతిక వాస్తవం ప్రపంచంలోని సకల జీవజాలం మనుగడకు ప్రాతిపదిక! గుర్తించని వారు సూర్యుడిని కేవలం అగ్నిగోళంగా భావిస్తున్నారు. గుర్తించిన భారతీయులు అనాదిగా సూర్యుడిని ప్రాణప్రదాతగా ఆరాధిస్తున్నారు! ‘రథ సప్తమి’ ఈ ఆరాధనకు కృతజ్ఞత ఆవిష్కరణకు ప్రత్యేక ప్రతీక!!
వివిధ ఇంధనాల వినియోగంవల్ల ప్రకృతి కాలుష్యగ్రస్తం అవుతోంది. అంతేకాదు ఈ ఇంధన నిక్షేపాలు పరిమితంగా ఉన్నాయి. నిరంతరం వినియోగంవల్ల ఈ ఇంధనాల నిక్షేపాలు ఏదో ఒక రోజున అంతరించి పోవడం ఖాయం... వంద ఏళ్లు పట్టవచ్చు రెండు వందల ఏళ్లు పట్టవచ్చు! బొగ్గు, చమురు, ఇంధన వాయు నిక్షేపాలు అంతరించే లోగా మరోచోట సహజంగా ఈ ఇంధనాల నిక్షేపాలు ఏర్పడుతాయన్న విశ్వాసం కూడ లేదు. అందువల్ల విద్యుచ్ఛక్తి ఏకైక ఇంధనంగా ఎప్పుడో అప్పుడు ఏర్పడక తప్పదు. బొగ్గు ద్వారాను, అణు ఇంధనం ద్వారాను విద్యుచ్ఛక్తిని ఉత్పత్తిచేసే ప్రక్రియవల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది! బొగ్గువాడకం పూర్తిగా తగ్గించాలన్నది పర్యావరణ కాలుష్య నివారణకు ‘పారిస్’ సదస్సులో చేసిన నిర్ధారణ... అందువల్ల జల విద్యుచ్ఛక్తి, సౌర విద్యుచ్ఛక్తి వాడకం, ఉత్పత్తిపెరగడం అనివార్యమైన పరిణామక్రమం! జల, వాయు, సౌర- అగ్ని- మూడు ప్రాకృతిక శక్తులు... భూమి, ఆకాశం ‘పంచభూతాల’లోని మిగిలిన రెండు! అందు ప్రాకృతిక ధాతువుల ప్రాతిపదికగా విద్యుత్ ఇంధనాన్ని తయారుచేయడం ప్రకృతి ప్రక్షాళనకు దోహదకరం. ‘‘పంచభూత భాసితమైన’’ ప్రకృతిలో నిజానికి ఈ మూడువిధాల విద్యుత్ ఇంధనాలు నిహితమై ఉన్నాయి. అందువల్ల సౌరశక్తి ప్రాధాన్యం పెరిగినకొద్దీ అంతర్జాతీయ సమాజం మన దేశం ప్రాధాన్యం పెరగడం ఖాయం!
సమశీతోష్ణ భూమండలాన్ని ‘సౌరశక్తి మండలం’గా గుర్తించడం మన ప్రభుత్వం సాధించిన విజయం. సూర్యుని సాపేక్ష ‘చలనం’ ప్రాతిపదికగా ఏర్పడిన సనాతన- శాశ్వత- భౌగోళిక స్థితి ఈ సౌరశక్తి మండలంలో మన దేశానికి సహజమైన నాయకత్వం కట్టబెట్టింది. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న ఇరవై మూడున్నర ‘్భగ’-డిగ్రీ-ల అక్షాంశంపై మకరరేఖ- కాప్రీకార్న్- ఏర్పడి ఉంది! భూమధ్య రేఖకు ఉత్తరంగా ఇరవై మూడున్నర ‘్భగ’ల అక్షాంశంపై కర్కటకరేఖ- కాన్సర్- ఏర్పడి ఉంది! భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఈ రెండు ‘రేఖ’ల మధ్య ఉన్న-మకర రేఖకూ, కర్కాటక రేఖకు మధ్య ఉన్న- భూమండల ప్రాంతంలోనే సూర్యుడు ‘సాపేక్షం’గా సంచరిస్తున్నాడు. ఈ ప్రాంతంలో మాత్రమే సూర్యుడు నిటారుగా పెరుగుతున్నాడు. అందువల్ల ఈ సమశీతోష్ణ మండలం దేశాలలో సౌరశక్తి వనరులు అపారం, అత్యధికం, అనంతం! చైనా, జపాన్, అమెరికా, బ్రిటన్, రష్యా వంటి సంపన్న దేశాలు ఈ సమశీతోష్ణ భూమండలానికి వెలుపల నెలకొని ఉన్నాయి. ఈ సమశీతోష్ణ మండలంలోని అతి ప్రముఖ దేశం భారతదేశం. అందువల్ల మన ప్రభుత్వం చొరవతో ఏర్పడిన ఈ ‘సౌరశక్తి మండల దేశాల కూటమి’ నాయకత్వం సహజంగా మన దేశానికి లభించింది. ‘కూటమి’కార్యాలయం మన దేశంలో నెలకొని ఉంది. భారతదేశానికి లభించిన ఈ ప్రాధాన్యం సూర్యుడు ప్రసాదిస్తున్న వరం! వికసించిన వెలుగుల ‘పువ్వుల’ సుగంధం సౌరశక్తి!! ‘రథ సప్తమి’నాడు ఈ ‘సుగంధపు’ కాంతి కిరణ పుష్పాలతోనే వెలుగుల ప్రదాతను పూజించడం సహజ సనాతన ప్రాకృతిక సంప్రదాయం.

‘పౌర’ సెగకు మూలమేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ చరిత్రలో ఓ ప్రభుత్వం చేపట్టిన చట్టానికి వ్యతిరేకంగా నెలల తరబడి నిరసన జ్వాలలు రగిలిన ఉదంతాలు ఇటీవల కాలంలో ఎన్నడూ లేనిదే! జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్‌ఆర్‌సి)ని అస్సాంలో ప్రవేశ పెట్టినప్పుడు మొదలైన నిరసనలు అనంతరం మోదీ సర్కార్ ఆమోదించిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టంతో మరింత ముదురుపాకాన పడ్డాయి. తాజాగా జాతీయ జనగణన పట్టిక పేరుతో మరో ఆంశం తెరపైకి రావడంతో ఈ మూడింటిపైనా మోదీ సర్కార్ ముప్పేట దాడినే ఎదుర్కొంటోంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం వివరణలు ఇస్తున్నా.. ఇవేవీ భారతీయ పౌరులకు వ్యతిరేకం, ప్రతికూలం కాదని చట్టసభల్లోనూ, బయటా.. రాత్రింబవళ్లు వివరణలు ఇస్తున్నా కూడా జనాగ్రహం తగ్గడం లేదు. వీటి స్వభావం, వాటిలోని అంశాలు, ఉద్దేశాలపై అనుమానాలు మాత్రం నివృత్తి కావడం లేదు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా వీటిపై వివిధ దేశాల్లో నిరసనలూ చెలరేగడాన్ని బట్టి చూస్తే.. వీటి వెనుక మోదీ సర్కార్ అసలు ఉద్దేశమేమిటన్నది వివాదానికి మూలకారణంగా కనిపిస్తోంది. భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లు మతపరమైన దేశాలు. ఇస్లాం మతాలే ప్రధానంగా ఉన్న ఈ దేశాల్లో భారత్ నుంచి తరలి వెళ్లి.. అక్కడ మతపరమైన వేధింపులు తాళలేక తిరిగి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధమతస్తులు, పార్శీలు, క్రైస్తవులు ఎందరో ఉన్నారు. వీరంతా ఈ మూడు దేశాల్లో మైనార్టీలే..! వీరిని ఆదుకోవాల్సిన అవసరం, అగత్యం ఉంది కాబట్టే పౌరసత్వ సవరణ చట్టం తెచ్చామని ఇది తమ జాతీయ బాధ్యత అంటూ మోదీ ప్రభుత్వం వివరణ ఇవ్వని రోజు లేదు. ఐనా.. వివాదానికి ప్రధాన హేతువు ముస్లింలను విస్మరించారన్న వాదన. పైగా ఈ చట్టం వల్ల దేశంలోని ముస్లింలకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారం కూడా ఒక రకంగా నెలల తరబడి అవిశ్రాంతంగా సాగుతున్న నిరసనలకు ఎప్పటికప్పుడు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. దేశంలో పెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌తో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇంత తీవ్రంగా ఉద్యమం సాగుతోందంటే అది కేవలం రాజకీయపరమైన చర్యగా, కేవలం రాజకీయ పార్టీలే ఎగదోస్తున్న జ్వాలగా భావించడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఇటీవలి కాలంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసనల్లో పాలుపంచుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై పునరాలోచించాల్సిందిగా ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖల ద్వారా ఎన్నో విన్నపాలు, విజ్ఞప్తులూ చేశారు. వీటిని ఏ మాత్రం ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే పరిస్థితి నానాటికీ జటిలంగా, సమస్యాత్మకంగా మారుతోంది. సీఏఏ పార్లమెంట్ ఆమోదించిన చట్టం కాబట్టి దాన్ని అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాల్సిందేనన్న కేంద్ర ప్రభుత్వ వాదన పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడానికి కారణమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. పశ్చిమ బెంగాల్ సహా పలు బీజేపీయేతర పార్టీలు ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా తమతమ అసెంబ్లీల్లో తీర్మానాలూ చేశాయి. దీనితో పాటు ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలనూ అమలు చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేశాయి. మరే బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో లేనంతగా పశ్చిమ బెంగాల్‌లో ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోనే నిరసనలు రోజువారీగా వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కేవలం ముస్లింలే ఈ ఉద్యమ పథం తొక్కారు. ముఖ్యంగా విద్యార్థులు సైతం వీటిపై కదం తొక్కడంతో ఉద్యమ తీవ్రత ఇటీవలి కాలంలో ఎంతగా ఆందోళన రేకెత్తించిందో మనం చూశాం. పరిస్థితిని ఇలాగే వదిలేస్తే అది కచ్చితంగా శాంతి భద్రతల సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. అయితే ఆ హక్కు పక్కదోవ పట్టి నిరసనల పేరిట అరాచక శక్తులు అలజడి సృష్టించేందుకు గల అవకాశాలనూ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సమస్య సామరస్యపూర్వక పరిష్కారానికి దోహదం చేయాలి. సీఏఏ చట్టం అమలును ఎవరూ అడ్డుకోలేరన్న పిడివాదం వల్ల ఆందోళనల తీవ్రత మరింత పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం ఉండదన్న వాస్తవాన్ని విజ్ఞతాయుతంగా గుర్తించాలి. సీఏఏ రాజ్యాంగ చెల్లుబాటు ఆంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉన్న నేపథ్యంలో అనుకూల, ప్రతికూల వర్గాలు సంయమనం పాటించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. కానీ అలాంటి అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మరో రెండు రోజుల్లో జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రచార తీవ్రత పరిస్థితిని మరింత జటిలం చేసింది. ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో ఇటు అధికార పక్షం, అటు విపక్షం పరస్పర విమర్శలతో పరిస్థితిని మరింత సంక్షుభితంగా మార్చాయే తప్ప సామరస్య వాతావరణానికి అవకాశం ఇవ్వడం లేదన్నది నిజం. ఇందుకు హస్తిన మూల కేంద్రంగా మారింది. ఆందోళనకారులపై జరిగిన కాల్పులు హిందుత్వ రాజకీయాలే ఈ చట్టం వెనుక ఉన్న అసలు ఉద్దేశమన్న భావనకు దారితీశాయి. ఈ నిరసనలు నిజంగా పౌర సమాజ సారథ్యంలోనే సాగుతున్నాయా లేక వీటి వెనుక అరాచక శక్తులు ఉన్నాయా అన్న వాస్తవాన్ని నిగ్గుదేల్చి తగిన రీతిలో పోలీసు చర్య తీసుకోవాల్సింది పోయి.. దాన్ని మరింతగా రగిల్చేందుకే పాలక పార్టీ ప్రయత్నించింది. ద్రోహుల్ని కాల్చేయాలంటూ ఓ కేంద్ర మంత్రి చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసే చందమే.. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా పాలక, విపక్షాలు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పరస్పరం రెచ్చగొట్టుకోవడం వల్ల ఈ సమస్యా ఎన్నటికీ పరిష్కారం కాదు. సమున్నత ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారత్‌కు ఈ రకమైన ఆందోళనలు నెలల తరబడి సాగడం దాని ప్రతిష్టకే మాయని మచ్చగా మిగిలిపోతాయి. ఇది పంతాలు, పట్టింపులతో పరిస్థితిని మరింత ముదరబెట్టుకునే తరుణం కాదు.. రాజీ పథంలో సామరస్య వాతావరణానికి దోహదం చేసే దిశగా పాలక పార్టీ ఉద్యుక్తం కావాలి. అసలు పౌర చట్టంపై ఎందుకు వ్యతిరేకత రగులుకుందన్న మూలాన్ని శోధించి దాన్ని నివృత్తి చేయాలి. పొరుగున ఉన్న మూడు దేశాల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కోలేక భారత్‌కు వచ్చిన వారిని వెళ్లగొట్టాలని ఏ పౌరుడూ భావించడు. అవసరమైతే పౌరసత్వ సవరణ చట్టాన్ని జనం మెచ్చే విధంగా సవరించడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసమే ప్రభుత్వం కాబట్టి.. వారి అభిమతానికి పట్టం కట్టాల్సిందే.. పౌరసత్వ కల్పన విషయంలో సంకుచిత భావన వీడి విశాల దృక్పథాన్ని కనబరచాలి. కేవలం మూడు దేశాల్లోని మైనార్టీ హిందువులకే పౌరసత్వం అన్న అంశాన్ని చట్టంలో సవరిస్తే.. పరిస్థితి సద్దుమణుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ హితం కోసం, ప్రజా సంక్షేమం కోసం, లౌకిక భారతం మరింత వేళ్లూనడం కోసం సర్కార్ ఈ రకమైన సవరణకు సిద్ధపడితే.. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తే ఆందోళనల అగ్ని చల్లారుతుంది. ఇందుకు విపక్షాలు కూడా నిర్మాణాత్మక రీతిలో దోహదం చేయాలే తప్ప సర్కార్ తీసుకునే ప్రతి చర్యనూ తప్పుబట్టడమే పనిగా పెట్టుకోకూడదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ సామరస్య వాతావరణానికి వేదిక కావాలి. అధికార, విపక్షాలు కలిసి ఉద్యమ భారతానికి తెరదించాలి. ఈ దిశగా ఇరు వర్గాలు కనబరిచే సహేతుకత, విశాల దృక్పథం దేశ ఖ్యాతిని మరింత ఇనుమడిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు..

‘నిర్మాణ’ నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘ఎప్పటి రాముడు సీతమ,
ఎప్పటి లక్ష్మణుడు ఎన్ని ఏళ్లు గతించెన్?!
ఇప్పటికి కరకు మాయల!
అప్పటి వాల్మీకి రచనల జరామరమై..’’
శివారెడ్డి శేషురెడ్డి అన్న ప్రజాకవి అభివర్ణించిన తీరు ఇది! వాల్మీకి మహర్షి ప్రపంచంలో ఆదికవి మాత్రమే కాదు, మొట్టమొదటి చరిత్రకారుడు. ఆయన రచించిన ‘రామాయణమ్’ కావ్యం మాత్రమే కాదు, ఇతిహాసం కూడ. ‘ఇతిహాసం’అని అంటే ఆధునిక పరిభాషలో చరిత్ర... రామాయణమ్, మహాభారతం ఇతిహాస గ్రంథాలన్నది తరతరాల జన జీవన వాస్తవం. ఈ రెండు జాతీయ చారిత్రక గ్రంథాలలోని మానవులు కల్పిత పాత్రలు కాదు, వారు మన దేశంలో పుట్టి పెరిగి జీవించినవారు!! తమ సమకాలంలోని ఈ వాస్తవ మహాపురుషుల చరిత్రను వాల్మీకి ‘రామాయణమ్’ ద్వారాను, కృష్ణ ద్వైపాయన వ్యాసుడు ‘మహాభారతమ్’ ద్వారాను గ్రంథస్థం చేశారు!! ఈ ఇద్దరు జాతీయ చరిత్రకారుల రచనలవల్ల రఘుకుల రాముడు, యదుకుల కృష్ణుడు ఈ దేశంలో పుట్టిపెరిగిన మహాపురుషులని, భరతమాత వజ్రాల బిడ్డలని తరతరాలుగా ధ్రువపడింది! అందువల్ల వీరిద్దరు, వీరిద్దరి చరిత్రను చెప్పిన వారిద్దరూ, వీరి సమకాలంలోను, వీరికి పూర్వం, వీరి తరువాత కూడ ఈ దేశంలో పుట్టిపెరిగిన అసంఖ్యాక మహనీయులూ కూడ జాతీయ మహాపురుషులు, భరతమాతృ కీర్తిపతాకలు, జాతీయ సంస్కృతి ప్రతీకలు, తరతరాల స్వజాతీయులకు స్ఫూర్తిప్రదాతలు... వందనీయులు! అందువల్ల అయోధ్య రామజన్మభూమి కాని, మధురలోని కృష్ణ జన్మభూమి కాని జాతీయ సముత్కర్ష గరిమకు చారిత్రక సాక్ష్యాలు! అందువల్ల కుల, మత, భాషా ప్రాంత వైవిధ్యాలకు అతీతంగా జాతి ప్రజలందరూ రఘురాముని, యదుకృష్ణుని తమ పూర్వులుగా గుర్తించి గౌరవించాలి. ఆరాధించాలి! అబ్దుల్‌కలాం వలె, గాంధీ మహాత్ముని వలె, సుభాష్ చంద్రవసు వలె, వివేకానందస్వామి వలె, ఛత్రపతి శివాజీ వలె, విక్రమ శాలివాహనుల వలె, ఆదిశంకరాచార్యుని వలె రఘరాముడు, యదుకుల కృష్ణుడు ఈ దేశ ప్రజలందరికీ జాతీయ మహాపురుషులు! అందువల్ల ‘రామజన్మభూమి’ మతాల మధ్య వివాదంగా పరిణమించి ఉండరాదు!! మతాలు, భాషలు, ఇతరేతర వైవిధ్యాలు అనేకం ఉన్నప్పటికీ మన దేశ ప్రజలు అనాదిగా ఒకే ‘జాతి’గా వికసించారు, ఒకే సంస్కృతి నిబద్ధులయ్యారు!! అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ‘పదిహేను సభ్యుల స్వతంత్ర మండలి’ని నిర్మించడం ఈ అద్వితీయ జాతీయ నిరంతర ప్రస్థాన క్రమంలో, అందువల్ల, మరో సముజ్వల ఘట్టం!!
నిజానికి ఇది మందిర పునర్ నిర్మాణ కార్యక్రమం!! ‘రామజన్మభూమి’ వివాదగ్రస్తం కావడం ఇందుకు నేపథ్యం! బ్రిటన్ దురాక్రమణ సాగిన కాలంలో సంభవించిన వైపరీత్యాలు ఇందుకు కారణం... బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు మన చరిత్రను- యుగయుగాల కోట్ల ఏళ్ల చరిత్రను- చెఱచారు, ఈ చరిత్ర కేవలం ‘‘కల్పన’’-మిత్-గా చిత్రీకరించారు, ప్రచారం చేశారు, విద్యాలయాలలో బోధించారు. ఫలితంగా బ్రిటన్ ముష్కరులు అంగీకరించిన ఆధునిక చరిత్ర లేదా కలియుగ చరిత్ర మాత్రమే చరిత్రగా మిగిలింది. ఈ ఆధునిక చరిత్రలో సైతం బ్రిటన్ విబుధ దైత్యులు అనేక వక్రీకరణలను చొప్పించారు. బ్రిటన్‌వారు అంగీకరించని పూర్వయుగాల భారతీయ చరిత్ర లేదా హైందవ జాతీయ చరిత్ర ‘‘కాల్పనిక సాహిత్యం’’- మైథాలజీ-గా ముద్ర పడింది. ఈ ‘ముద్ర’కారణంగా మన దేశంలోని చారిత్రక పురుషులు ‘‘కల్పిత పాత్రలు’’గా మారిపోయారు. ఈ ‘‘ముద్ర’’ను తొలగించుకొని జాతీయ చరిత్రను చరిత్రగా పునరుద్ధరించుకున్నట్టయితే రఘురాముడు, యదుకుల కృష్ణుడు వంటి వారు ‘‘కల్పిత పాత్రలు’’కాదని, వారు నిజమైన చారిత్రక పురుషులని ఈ దేశ ప్రజలందరూ అంగీకరిస్తారు. గతంలోనే ఈ ముద్ర తొలగి ఉండినట్టయితే రఘురాముని జన్మస్థలంపై వివాదమే ఏర్పడి ఉండేది కాదు... రామజన్మభూమి మందిర పునర్ నిర్మాణంతోపాటు ఈ జాతీయ చరిత్రను పునరుద్ధరించడం అనివార్యం కావాలి!
ఉదాహరణలను ఎన్నింటినైనా చెప్పవచ్చు... మతం దేశంలోని ఒక జన సముదాయం, వివిధ మత జన సముదాయాల సమష్టి సమాహారం జాతి! అందువల్ల మొత్తం జాతికి సంబంధించిన జాతీయ మహాపురుషులు అన్ని మతాలకు ఆరాధ్యులు, మొత్తం జాతికి సంబంధించిన చరిత్ర అన్ని మతాల వారిది... మొత్తం జాతికి సంబంధించిన సంస్కృతి పట్ల అన్ని మతాలవారు సమైక్యభావ బద్ధులు కావాలి! మొత్తం జాతికి సంబంధించిన మాతృభూమి అన్ని మతాలవారికీ సమానంగా తల్లి! జాతీయ హితం సర్వమత జన సముదాయం. ఇదీ జాతీయ వికాసక్రమానికి సహజ భూమిక! ఈ మతాలు అనాదిగా ఈ దేశంలో పుట్టిపెరిగాయి, కొన్ని విదేశాలనుంచి వచ్చాయి, వ్యాపించాయి. ఏమయినప్పటికీ ఉప నదులన్నీ మహానదిలో కలసినట్టుగా మతాల ప్రవాహాలన్నీ జాతీయ మహాస్రోతస్వినిలో సంలీనం కావడం సహజ పరిణామం కావాలి! ఇలా జరుగకుండా బ్రిటన్ ముష్కరులు కుట్ర పన్నారు. వివిధ మత సమాహారమైన ఈ దేశపు సనాతన జాతీయతను బ్రిటన్ మేధావులు కేవలం ఒక ‘మతం’గా చిత్రీకరించారు. ఫలితంగా అనాది జాతీయ అస్తిత్వమైన హిందుత్వం లేదా భారతీయత కేవలం ఒక ‘మతం’స్థాయికి దిగజారిందన్న భ్రమ వ్యాపించింది. రఘురాముడు, యదుకృష్ణుడు వంటి జాతీయ మహాపురుషులు కేవలం ఒక మతానికి మాత్రమే చెందిన వ్యక్తులన్న భ్రాంతి వ్యాపించింది, ‘జాతీయ తత్త్వము’ ‘‘మతోన్మాదమన్న భ్రాంతి’’ వ్యాపించింది! రామజన్మభూమి మందిర నిర్మాణంతోపాటు ఈ దేశపు వౌలిక జాతీయ అస్తిత్వం కేవలం ఒక మతమన్న భ్రమను తొలగించడానికి కృషి జరగాలి! హిందుత్వం లేదా భారతీయత ‘మతం’కాదన్న, సర్వమత సంపుటమైన జాతి అన్న వాస్తవం మళ్లీ వెలగాలి!! అమెరికాలోని అన్ని మతాలవారు జార్జివాషింగ్‌టన్, అబ్రహామ్ లింకన్ వంటి వారిని తమ జాతీయ నాయకులుగా సంభావించడం ఒక ఉదాహరణ మాత్రమే...
రఘురాముడు, యదుకుల కృష్ణుడు ఇలా మత పరిధిలోని వారు కాదు, వారు జాతీయ మహాపురుషులు, ఆంగ్ల పరిభాషలో స్టేట్స్‌మెన్! రఘురాముడు ఆదర్శపాలకుడు, పదహారు శుభంకర లక్షణాలను ఆదర్శాలను ఆచరించి ప్రస్ఫుటింపచేసిన వాడు! అధికారం చెలాయించలేదు, ప్రజలను ఉపాసించాడు! దళితులను, నిరుపేదలను, వన జనులను సోదరులవలె సమాదరించాడు. రామమందిర పునర్నిర్మాణ పథంలో ప్రస్తుతం దళితులు అగ్రగాములై ఉండడం చారిత్రక పునరావృత్తి! మహాకవి డాక్టర్ బోయి భీమన్న అభివర్ణించినట్టు...
‘‘ఒక సతి, ఒక్క మాట, శర మొక్కటి,
ఇయ్యవి మూడొకట్లు, ఇం
దొకటియె చాలు మానవుని
ఉన్నతం చేయగ, మూడు ఒక్కటై
వికసనమొందు మానవుడు
విశ్వాస మున్నతుడేలకాడు? అం
దుకె, పరిపూర్ణుడై జన
మనోరముడయ్యెను రాముడెంతయున్.