‘మందకొడి’ మైత్రి!.December 18th, 2011
ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్ రష్యాకు వెళ్లిరావడం మన దేశానికీ ఆ దేశానికీ మధ్య కల మైత్రీబంధం ‘యథాతథం’గా కొనసాగుతోందనడానికి మరో నిదర్శనం. ఉభయ దేశాలమధ్యగల వ్యూహ్మాక దౌత్య సంబంధాలను ‘మందకొడితనం’ ఆవహించి ఉండడం ఈ ‘యథాతథ’ స్థితి! ఈ మందకొడితనాన్ని తొలగించడానికి మన ప్రధాని పర్యటన దోహదం చేయకపోవడం వర్తమాన వైపరీత్యం. రష్యా అధ్యక్షుడు డిమిత్రీ మెద్వెదెవ్, ప్రధామంత్రి వ్లాదిమిర్ పుతిన్ మన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. సౌహార్దపూర్వకంగా చర్చలు జరిపారు. కానీ ఈ పర్యటన సందర్భంగా కుదిరిన చెప్పుకోదగిన కొత్త ఒప్పందాలు లేవు. 1950వ దశకంనుంచి కూడా ఉభయ దేశాలకు మధ్య పరస్పర ప్రయోజనం కలిగించిన అంశం వ్యూహాత్మక సహకారం. ద్వైపాక్షిక సంబంధాలలోను అంతర్జాతీయ వ్యవహారాలలోను 1980వ దశకం చివరివరకూ ఈ వ్యూహాత్మక సహకారం ప్రధానంగా ప్రస్ఫుటించింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఏర్పడిన ప్రధాన విపరిణామం మన కూ రష్యాకు మధ్యగల స్నేహ సంబంధాలలో మందకొడితనం ఏర్పడడం. 2000 వరకు బోరిస్ ఎల్టిసిన్ అధ్యక్షుడుగా ఉండిన కాలంలో మనతో అంటీ ముట్టినట్టు రష్యా వ్యవహరించం ఇపు డు చరిత్ర! వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడుగా ఎన్నికయిన తరువాత ఉభయ దేశాలమధ్య మైత్రీ స్ఫూర్తి చిగురులు వేయటం ఆరంభించినప్పటికీ 1970వ దశకంనాటి స్థాయికి అది ఎదగకపోవడం వాస్తవ వైచిత్రి! దిమిత్రీ మెద్వెదెవ్ 2008లో అధ్యక్షుడయినప్పటికీ రష్యా విదేశాంగ నీతిని నడిపిస్తున్నది మాత్రం ప్రధాని హోదాలో వ్లాదిమిర్ పుతిన్. వచ్చే ఏడు పుతిన్ మళ్లీరష్యా అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. వ్యూహాత్మక విధానంలో పుతిన్ అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకి. మన దేశం అమెరికాతో ‘అతి మైత్రి’ని కొనసాగిస్తోందన్న అభిప్రాయం కారణంగానే ఈ ‘మందకొడితనాన్ని’ వదిలించడానికి రష్యా ప్రభుత్వం ప్రయత్నించడం లేదన్నది స్పష్టం. ఈసంగతి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ ఈనెల 15వ, 16ల తేదీలలో రష్యాలో ఉండిన సందర్భంగా మరోసారి ధ్రువపడింది! ప్రధాని జరిపిన చర్చల సందర్భంగా ‘విక్రమాదిత్య’ యుద్ధనౌక సంగతి ప్రస్తావనకు రాకపోవడం ‘వ్యూహాత్మక’మైన మందకొడితనానికి మరో నిదర్శనం. ‘అరిహంత’ జలాంతర్గామి నౌకాదళంలో ప్రవేశించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ‘అరిహంత’ వంటి మరో అణుచోదిత అణ్వస్తవ్రాహక జలాంతర్గామి మనకు ఇప్పటికీ లభించలేదు. సరఫరా చేయడానికి రష్యా అంగీకరించి రెండేళ్లు దాటినా ఇంతరకూ వాగ్దానం నెరవేరలేదు. ఆ సంగతిని ఉభయ దేశాలు మాస్కోలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ప్రస్తావించకపోవడం ‘మందకొడితనానికి’ మరో ప్రబల సాక్ష్యం. వచ్చే నాలుగు సంవత్సరాలలో ఉభయ దేశాల మధ్య వాణిజ్యం పరిమాణం రెట్టింపు కాగలదన్నది మాత్రమే మన్‌మోహన్‌సింగ్ పర్యటన సందర్భంగా వెల్లడయిన ప్రధాన అంశం. అయితే ఇది కూడా ఉభయ దేశాల ప్రభుత్వ అధినేతలు వ్యక్తంచేసిన ఆకాంక్ష మాత్రమే. ఇందుకోసం ఆచరణాత్మకమైన ఒప్పందం ఏదీ కుదరలేదు. కొన్ని యుద్ధవిమానాలను రష్యా నుండి కొనుగోలు చేయడానికి మనదేశం అంగీకరించడం దౌత్యపరంగా మన వైఫల్యానికి నిదర్శనం. ‘కుడంకులం’ అణు విద్యుత్ ఉత్పాదక కేంద్రానికి సంబంధించిన మూడవ, నాలుగవ దశల నిర్మాణానికి సంబంధించి రష్యా రాజధానిలో చర్చలు జరిగాయట! మొదటి రెండు దశల ఉత్పాదక వ్యవస్థలు కూలబడి ఉన్న సమయంలో తరువాతి దశల గురించి ఆలోచించడం గుర్రానికి ముందు బండినికట్టడం వంటిది. ‘కుడంకులం’ అణుకేంద్రాన్ని ఆరంభిచవద్దని కోరుతూ తమిళనాడులో పర్యావరణ పరిరక్షకులు ఉద్యమిస్తున్నారు మరి!
ప్రస్తావిత అంశాలు అత్యంత సమంజసమైనప్పటికీ వాటిని సరిఅయిన సమయంలో చర్చించడం దౌత్యనీతిలోని ఔచిత్యం. గత ఏడాది మార్చిలో పుతిన్ మన దేశాన్ని సందర్శించాడు. డిసెంబర్‌లో మెద్విదెవ్ ఢిల్లీకి విచ్చేశాడు. ఈ రెండు సందర్భాలలోను శాంతి ప్రయోజనాలు అణుసహకారం గురించి విస్తృతంగా చర్చలు జరిగాయి. మనదేశంలో కొత్తగా అణువిద్యుత్ ఉత్పాదక కేంద్రాల నిర్మాణానికి రష్యా అంగీకరించినట్టు అపుడు ప్రచారమైంది. కానీ కొత్త కేంద్రాలు ఎక్కడ నిర్మిస్తారో ఇంతరకు వెల్లడి కాలేదు. ‘కుడంకులం’ అణుకేంద్రం సంగతి మాత్రం ఆ రెండు సందర్భాలలోను ప్రచారం కాలేదు. కుడంకులం గురించి గత ఏడాది ప్రజలలో వ్యతిరేకత ఏర్పడలేదు. అందువల్ల గత ఏడాది మొదటి ఉత్పాదక వ్యవస్థను ఆరంభించి ఉండి ఉంటే మిగిలిన మూడు దశల నిర్మాణం గురించి చర్చలు వేగవంతమయి ఉండేవి. ‘కుడంకులం’ గురించి ఒప్పందాలు జరిగి ఐదేళ్లు దాటింది. ‘రియాక్టర్’ వ్యవస్థను సరఫరా చేయడంలో రష్యా జాప్యం చేయంవల్లనే నిర్థారిత సమయంలో ప్రాజెక్టు నిర్మాణం కాకపోవడానికి కారణం.
చైనా ప్రభుత్వం మన సముద్ర జలాలలోకి చొచ్చుకొనివస్తున్న నేపథ్యంలో మన రక్షణ వ్యూహంలో అణుచోదిత జలాంతర్గాములు, యుద్ధనౌకలు అత్యంత కీలకమైనవి. ‘అరిహంత’ను మనం స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మించుకొన్నాము. అది సముద్ర ప్రవేశం చేసి పద్దెనిమిది నెలలు పైబడింది. అలాంటి మరో జలాంతర్గామి నిర్మించడానికి రెండేళ్లు పడుతుందని అపుడు నిర్థారణ జరిగిందట. అందువల్ల రష్యానుంచి వెంటనే మరో అణు జలాంతర్గామిని తెప్పిస్తున్నట్టు ప్రచారం జరిగింది. సరఫరా చేయడానికి రష్యా ఒప్పుకొంది. కానీ ఇంతవరకు ఆ జలాంతర్గామి మనకు దక్కలేదు! ఎపుడు అప్పగిస్తారని మన్‌మోహన్‌సింగ్ మాస్కోలో ప్రశ్నించలేదు! మరోవైపు, విమాన వాహన యుద్ధ నౌకను మన ప్రభుత్వం 2004లో కొనుగోలు చేసింది. పుట్టని బిడ్డకు పేరు పెట్టిన చందంగా దేశానికి తరలి రాకముందే దానికి ‘ఐఎఎన్‌ఎస్ విక్రమాదిత్య’ అని నామకరణం కూడా చేసుకున్నాము. అది కొత్త యుద్ధనౌక కాదు. రష్యావారు దాదాపు పదేళ్లపాటు ఉపయోగించిన పాతబడిన నౌక! ఈ ‘సెకెండ్ హ్యాండ్’ యుద్ధ నౌకకు అధునాతనరీతిలో మరమ్మతులు జరిపి మనకు అప్పగించడానికి 2004లో రష్యా వాగ్దానం చేసింది! కానీ రష్యా ప్రభుత్వం నౌకను అప్పగించడాన్ని పదే పదే వాయిదా వేస్తుండడం ‘మందకొడి’ మైత్రికి మరో తార్కాణం. ఈలోగా నౌక ధరను రష్యా ప్రభుత్వం రెండుసార్లు పెంచడం మాత్రమే మైత్రీపథంలో జరిగిన ప్రగతి. వచ్చే ఏడాదినాటికి తప్పనిసరిగా ‘విక్రమాదిత్య’ మనదేశానికి అరుదెంచనున్నట్టు గత ఏడాది పుతిన్, మెద్విదెవ్ పర్యటనల సందర్భంగా మన ప్రభుత్వం ప్రకటించింది. కానీ 2014 వరకూ ‘విక్రమాదిత్య’ మనకు దక్కదని 2009లో నిర్థారణ అయిపోయిందట! ఈ విషయమై మన ప్రభుత్వం స్పష్టీకరణలు కోరడంలేదు. ఈ మందకొడితనాన్ని మన్‌మోహన్‌సింగ్ మాస్కోలో సరికొత్తగా ప్రదర్శించి స్వదేశానికి తిరిగి వచ్చారు!
26, డిసెంబర్ 2011, సోమవారం
‘మందకొడి’ మైత్రి!.
లేబుళ్లు:
‘మందకొడి’ మైత్రి
అజిత్‌సింగ్ ‘ఫ్రాధాన్యం’
అజిత్‌సింగ్ ‘ఫ్రాధాన్యం’.December 20th, 2011
వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరుగనున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ మరోసారి విజయం సాధించడం ఖాయమన్న భయం ఆమె ప్రత్యర్థులందరినీ పీడిస్తోంది. రాష్ట్రీయ లోక్‌దళ్ నాయకుడు అజిత్‌సింగ్‌కు మరోసారి కేంద్రమంత్రి పదవి దక్కడానికి ఈ ‘్భయం’ నేపథ్యం. కూలబడి ఉన్న పౌర విమానయాన రంగాన్ని కోలుకునేలా చేయడం ఆయనకు ఎదురౌతున్న ప్రధాన సమస్య - అన్నది ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రచారం. కానీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో కుంటుతున్న కాంగ్రెస్‌ను పరిగెత్తించడం ఆయనకు ఎదురౌతున్న విషమ పరీక్ష అన్నది రాజకీయ మంత్రాంగం గురించి అవగాహన ఉన్న వారికి అర్థమైన వాస్తవం. నష్టాల ఊబిలో పడి నానాటికీ కూరుకొని పోతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థను బయటికి లాగి ఆకాశంలో ఎగిరించే సామర్థ్యం అజీత్‌సింగ్‌కు మాత్రమే ఉందని ప్రధాని మన్‌మోహన్‌సింగ్ ‘కనిపెట్టడానికి’ కారణం, ఈ కొత్త మంత్రికి ఉత్తరప్రదేశ్‌లో కొంత ‘కులం బలం’ ఉండడమే! కుల బలం వోట్ల రూపంగా మారి తమకు వెన్నుదన్నుగా నిలబడితే రానున్న శాసనసభ ఎన్నికలలో తమ బలం పెరుగుతుందన్నది కాంగ్రెస్ అధినేతల విశ్వాసం! మాజీ ప్రధాని చరణ్‌సింగ్ కుమారుడు కనుక ఉత్తరప్రదేశ్‌లో అజిత్‌కు గొప్ప గుర్తింపు ఉంది. అయితే ఆయన సహకరించిన వారందరూ ఆయన పార్టీకి వోట్లు వేయకపోవడం దశాబ్దుల చరిత్ర. 1970వ దశకం ముగిసేవరకూ ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో ప్రధా న ప్రత్యర్థి చరణ్‌సింగ్. జనతాపార్టీలో కూడా ఆయన అధికార కేంద్ర బిందువుగా అలరారడం చరిత్ర. అయితే ఈ చరిత్ర అజిత్‌సింగ్‌కు వారసత్వంగా సంక్రమించక పోవడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల గతిని మార్చిన విప్లవాత్మక పరిణామం! ఉత్తరప్రదేశ్ రాజకీయాలు గరిమనాభి అగ్రకులాల నాయకులనుండి వైదొలగి వెనుకబడిన కులాల వోటర్ల మధ్య ప్రతిష్ఠ కావడం ఈ విప్లవ పరివర్తనకు ప్రాతిపదిక. వెనుకబడిన కులాల నుండి పుట్టుకొచ్చిన ములాయంసింగ్, కల్యాణ్‌సింగ్ వంటి నాయకులు అజిత్‌సింగ్ పార్టీని మరుగుజ్జుగా మార్చేశారు. అందువల్లనే అజిత్‌సింగ్ తమ పార్టీ నాయకత్వం స్వీకరించినప్పటినుంచి ఏదో ఒక ప్రధాన పార్టీకి తోకగానే కొనసాగుతున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమయినప్పటినుంచి ‘తోక’ పార్టీలు ప్రధానపార్టీలను ఆడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ఐక్యప్రగతి కూటమి- యుపిఏలో రాష్ట్రీయ లోక్‌దళ్ చేరిపోవడం కాని వెనువెంటనే అజిత్‌సింగ్ మంత్రి పదవి లభించడం కాని ఈ ‘వాలక్రీడ’- తోకలాటకు కొనసాగింపు మాత్రమే!
ఐదుమంది లోక్‌సభ సభ్యుల ‘యుపిఏ’లో చేరడంకన్నా ఉత్తరప్రదేశ్‌లో తమ వోటర్ల సంఖ్య పెరగడం కాంగ్రెస్ పార్టీకిప్పుడు ప్రధానం. రాహుల్‌గాంధీ నాయకత్వ పటిమకు ఈ ఎన్నికలు గీటురాళ్లన్న ప్రచారం గత ఏడాదికి పైగా జరుగుతోంది. 2009నాటి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఆ రాష్ట్రంలో 22 స్థానాలు లభించినప్పటినుంచీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానం ఆకాంక్ష. ఈ ఆకాంక్షను సాకారం చేయడానికి అజిత్‌సింగ్ దోహదం చేయగలడా అన్నది సమాధానం దొరకని ప్రశ్న. అజిత్ పలుకుబడి మాత్రమే కాదు విశ్వసనీయత సైతం నానాటికీ దిగజారుతుండడం ప్రస్ఫుటిస్తున్న విపరిణామం. 1990వ దశకంలో ప్రధాని పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో మంత్రిగా ఉండిన అజిత్‌సింగ్ ఆ తరువాత కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలన్నింటితోను జట్టుకట్టడం వోటర్లలో ఆయన విశ్వసనీయత తగ్గిపోవడానికి కారణం. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీతోను, ములాయంసింగ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతోను, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీతోను ఆయన గతంలో పొత్తులు పెట్టుకున్నాడు. ఈ పొత్తుల కారణంగా అజిత్‌సింగ్ పార్టీకి మాత్రమే సీట్ల ప్రయోజనం సమకూడింది. ఒంటరిగా పోటీచేస్తే ఒక్క లోక్‌సభ స్థానంలోనైనా విజయం సాధించగల బలం రాష్ట్రీయ లోక్‌దళ్‌కు లేదు. 2009నాటి ఎన్నికలలో అజిత్‌సింగ్ పార్టీ ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకొనడానికి కారణం ‘్భజపా’తో పెట్టుకున్న పొత్తు. కానీ ఈ పొత్తు ‘్భజపా’ నాలుగవ స్థానానికి దిగజారిపోకుండా నిరోధించలేకపోయింది! అందువల్ల కాంగ్రెస్‌తో పొత్తువల్ల అజిత్‌సింగ్ పార్టీకి బలం పెరుగుతుంది! కానీ కాంగ్రెస్ పోటీచేసే స్థానాలలోని అజిత్ వోటర్లు ప్రధానంగా ‘జాట్’లు కాంగ్రెస్‌ను బలపరచడం మాత్రం సందేహాస్పదం... ఎవరికి లాభం?
ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రధాన జాతీయ పక్షాలు మూడు నాలుగు స్థానాలకోసం పోటీ పడడం దశాబ్దిగా కొనసాగుతున్న రాజకీయ విచిత్రం. 2009 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భాజపాకు 50, కాంగ్రెస్‌కు 22స్థానాలు దక్కాయి. 403 స్థానాలున్న శాసనసభలో మాయావతి నేతృత్వంలోని బిఎస్‌పి 205 స్థానాలు గెలిచింది. ఉత్తరప్రదేశ్‌లో ఒక పార్టీకి శాసనసభలో స్పష్టమైన మెజారిటీ రావడం రెండు దశాబ్దులలో అది మొదటిసారి. అంతవరకు కాంగ్రెస్ మద్దతుతోను ఇతర పార్టీల మద్దతుతోను ప్రభుత్వం నడిపిన ములాయంసింగ్ బలం తొంబయి తొమ్మిదికి దిగజారింది. కానీ 2009నాటి లోక్‌సభ ఎన్నికలలో బలాబలాలు తారుమారు కావడం ఆశ్చర్యం గొలిపిన పరిణామం. రాష్ట్రానికి చెందిన ఎనబయి లోక్‌సభ స్థానాలలో సమాజ్‌వాదీ పార్టీ ఇరవై మూడింటిని గెలుచుకోగా అధికార ‘బహుజన సమాజ్’కు ఇరవై మాత్రమే దక్కాయి. శాసనసభ ఎన్నికలలో నాలుగవ స్థానంలో ఉండిన కాంగ్రెస్ ఇరవై రెండు స్థానాలు కైవసం చేసుకొని, రెండవ స్థానానికి ఎదిగింది. భాజపా నాలుగవ స్థానానికి దిగజారిపోయింది. లోక్‌సభ ఎన్నికలలో కేవలం మూడున్నర శాతం వోట్లను పొందిన అజిత్‌సింగ్ పార్టీకి ఐదుస్థానాలు లభించగా ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న భాజపాకు పదిహేడున్నర శాతం మాత్రమే వోట్లు వచ్చాయి. ఏడుచోట్ల పోటీచేసిన రాష్ట్రీయ లోక్‌దళ్ ఐదుచోట్ల గెలిచింది. డెబ్బయి ఒక్క స్థానాలలో పోటీచేసిన భాజపాకు పది సీట్లు మాత్రం దక్కాయి. అజిత్‌సింగ్‌తో పొత్తుపెట్టుకున్న పార్టీలకు ప్రయోజనం పెద్దగా ఉండబోదన్న వాస్తవం ఇలా మరోసారి ధ్రువపడింది. ఇప్పుడు ఈ మూడున్నర శాతం వోట్లు ‘యుపిఏ’ కూటమికి బదిలీ అయినందువల్ల కాంగ్రెస్‌కు కొన్ని నియోజకవర్గాలు అదనంగా లభించవచ్చు. అజిత్‌సింగ్ మద్దతుదారులు, ఆయన పార్టీ అభ్యర్థులు లేనిచోట్ల, కాంగ్రెస్‌ను కాని, భాజపాను కానీ బలపరచబోరన్నది ఎన్నికల చరిత్ర ధ్రువపరచిన వాస్తవం. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్న నేపథ్యంలో అప్రతిష్ఠ పాలవుతున్న అజిత్‌సింగ్‌ను కలుపుకొనడం అంతుపట్టని వ్యూహం! అగ్రకులాల వోటర్లను ఆకట్టుకొనడం ద్వారా 2007నాటి ఎన్నికలలో గెలిచిన మాయావతి ఇప్పుడు ‘రాష్ట్ర విభజన’ పథకంద్వారా ప్రయోజనం పొందడానికి యత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని శాసనసభ తీర్మానించింది కూడా! తద్వారా రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలలోను మెజారిటీ శాసనసభ స్థానాలను గెలవడం ఆమె కొత్త వ్యూహం! ఈ వ్యూహాన్ని ఎదుర్కోగల ప్రతివ్యూహం ప్రత్యర్థులవద్ద లేకపోవడం మాయావతికి అనుకూలిస్తున్న అంశం!

భగవద్గీతపై పగ!.
భగవద్గీతపై పగ!.December 21st, 2011
రష్యా రాయబారి అలెగ్జాండర్ కథాకిన్ వ్యాఖ్యానించినట్టు వారు నిజంగా పిచ్చివారు! విశ్వవిజ్ఞానకోశమైన ‘్భగవద్గీత’ను వ్యతిరేకిస్తున్న ఆ పిచ్చివారు అతి కొద్దిమంది! అందువల్ల స్వరూపాత్మకంగా వారికి ప్రాధాన్యం లేదు. భగవద్గీతను నిషేధించాలని కోరుతూ వారు న్యాయస్థానంలో దావా వేయడం వల్ల భారత రష్యా దేశాల మధ్య మైత్రికి వాటిల్లనున్న ప్రమాదం అసలే లేదు. కానీ అతికొద్దిమందిని నడిపిస్తున్న స్వభావం అంతర్జాతీయ మతోన్మాద సమష్టి చిత్తవృత్తికి సంబంధించినది. అందువల్ల స్వభావాత్మకంగా ఇది మరో మహా వికృత పరిణామం. తమ ‘మతాన్ని’ తప్ప అన్య మతాల ఉనికిని సైతం సహించలేని స్వభావం జీవన విధానమైన ఉన్మాదులు అంతర్జాతీయంగా సాగిస్తున్న కుట్రలో భగవద్గీతను వ్యతిరేకించడం ఒక భాగం మాత్రమే! రష్యాలోని మంచుగడ్డల మయమైన సైబీరియా ప్రాంతంలోని కొందరు మత మూఢాచారులు భారతీయ సాంస్కృతిక పతాకమైన భగవద్గీతను తమ ప్రాంతంలో నిషేధించాలని కోరుతున్నారు. సైబీరియా ప్రాంతంలోని ‘్థమ్ స్కు’ పట్టణంలోని ఒక న్యాయాలయంలో ఇందుకోసం వారు దావా వేశారట! ‘్భగవద్గీత తీవ్రవాదాన్ని ప్రభోదిస్తోందట!’ ‘సామాజిక వైరుధ్యాలను అంకురింప చేస్తోందట!’ అందువల్ల భగవద్గీతను ప్రచురించకుండా నిరోధించాలన్నది సదరు న్యాయస్థానం వారికి ఆ ‘న్యాయార్థులు’ చేసుకున్న వినతి. ఈ ‘న్యాయార్థుల’లో కొందరు న్యాయవాదులు, మరికొందరు ప్రభుత్వ న్యాయవాదులు సైతం ఉండటమే ఈ వైపరీత్యానికి మరింత వికృతిని సంతరించి పెడుతున్న పరిణామం. మన పార్లమెంటులో మంగళవారం ఈ విషయమై నిరసనధ్వనులు చెలరేగకమునుపే మన దేశంలోని ప్రజల్లో అలజడి చెలరేగింది. ప్రసార మాధ్యమాలలో సంచలనం సంభవించింది. భగవద్గీతకు కల ప్రాముఖ్యానికి, ప్రసిద్ధికి ఇదంతా ప్రత్యక్ష ప్రమాణం. రష్యాలో సైతం అత్యధిక రాజకీయవేత్తలు, మేధావులు తమ దేశంలోని ‘గీతా విరోధులను’ తప్పు పట్టడం, దుయ్యబట్టడం భగవద్గీత సర్వజనీనతకు మరో తార్కాణం. సైబీరియా ప్రాంతపు అంబుడ్స్‌మాన్-ప్రభుత్వ న్యాయ సహాయకుడు- వ్లాదిమిర్ లుకిన్ వ్యాఖ్యానించినట్టు ‘‘్భగవద్గీత నిషేధించాలన్న ప్రయత్నం రష్యా రాజ్యాంగం ప్రసాదిస్తున్న ‘్భవ వ్యక్తీకరణ’ హక్కునకు విఘాతకరం’’ ‘్థమ్‌స్కూ’ పట్టణంలోని న్యాయస్థానం అధికార పరిధి పరిమితమైనది. భగవద్గీతను వ్యతిరేకిస్తున్న మతమూఢవాదుల అభ్యర్థనను ఆ న్యాయాలయం అంగీకరించదు. అలా అంగీకరించడం రష్యా రాజ్యాంగ సర్వమత సమభావ స్ఫూర్తికి వ్యతిరేకం కాగలదు. ఒకవేళ ఆ న్యాయాలయం తప్పు తీర్పును ఇచ్చినప్పటికీ రష్యా అంతటాకానీ, సైబీరియా ప్రాంతమంతటా కానీ అది వర్తిచదు! అంతేకాక ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ‘అంతర్జాతీయ కృష్ణ భక్త సమాజం’-ఇస్కాన్- స్థానిక విభాగం వారు అప్పీలు చేయవచ్చు. అప్పుడైనా భగవద్గీత విరోధుల వాదం వీగిపోక తప్పదు. ఇంకా ఆలోచించినప్పుడు ఇదంతా చిన్న విషయంగా కనిపిస్తుంది. కానీ ఈ చిన్న ఘటనను సృష్టించిన వారు ‘సర్వమత సమభావ వ్యవస్థ’ను వ్యతిరేకిస్తున్న, ధ్వంసం చేయ యత్నిస్తున్న అంతర్జాతీయ పన్నాగంలో పావులు, పాత్రధారులు! ఇది నిరంతరం వ్యాపిస్తున్న మహాప్రమాదం. అంతర్జాతీయ ప్రజాస్వామ్య సర్వమతసమభావ వ్యవస్థను భగ్నం చేయడం లక్ష్యమైన పెనుభూతం ఇప్పుడు సైబీరియాలోచిచ్చుపెట్టింది. రేపు దక్షిణాఫ్రికాను మండించవచ్చు. ఎల్లుండి చిలీ దేశంలో జ్వాలలను రేపవచ్చు! ఇదీ ప్రధాన సమస్య!
సృష్టిగత సత్యాన్ని సమాజగత జీవనంగా సమావిష్కరించిన సనాతన విజ్ఞానం భగవద్గీత! ఇది ఒక మతానికో లేదా ప్రాంతానికో పరిమితమైన విజ్ఞానం కాదు. సమస్త మానవాళికి సమన్వయం అవుతున్న జీవన సంస్కారం, హేతుబద్ధమైన సాంస్కృతిక తత్వం. ‘్భగవద్గీత’ భారతదేశంలో గ్రంథస్థరూపమెత్తడం సమాజ చారిత్రక పరిణామం. అందువల్ల ఇది భారతదేశ జాతీయ గ్రంథం. ఐదువేల వంద ఏళ్ళనాడు జరిగిన మహాభారత యుద్ధ సమయంలో యదుకుల కృష్ణుడు పాండవ మధ్యముడైన అర్జునుడికి ఈ విజ్ఞానాన్ని బోధించాడు. సృష్టిగత సత్యాన్ని,సృష్టిని నడిపిస్తున్న సత్యాన్ని వివరించాడు. మహాభారతకారుడైన వేదవ్యాసుడు కృష్ణుడు చెప్పిన దాన్ని గ్రంథస్థం చేశాడు. భగవద్గీత మహాభారతంలోని ఒక భాగం. మహాభారతం ఇతిహాస గ్రంథం! ఈ చరిత్ర భారతీయ జీవన చరిత్ర. ఒక మతానికి కాని సంప్రదాయానికి గాని పరిమితమైన చరిత్ర కాదు. అందువల్ల మతపరమైన ఉన్మాదంతో ఇతర మతాలను ద్వేషించేవారు సైతం భగవద్గీతను కాని, మహాభారత కావ్యాన్ని కాని ద్వేషించనక్కరలేదు. మతోన్మాదుల మలిన తర్కానికి సైతం విరుద్ధమైన అంశమిది! భగవద్గీతలో వివరించిన ‘్భక్తి’ ఒక మతానికే పరిమితం కాదు. కర్మ,జ్ఞాన, భక్తి యోగాల సంస్కార సమాహారం భగవద్గీత. కర్మయోగం ద్వారా కార్యాకారణ సంబంధాన్ని వివరించింది. జ్ఞానయోగం ద్వారా సత్యమైన విశ్వ వ్యవస్థను దర్శింపజేసింది! భక్తి ద్వారా సృష్టికర్త సృష్టికంటే భిన్నంగా లేడన్న వాస్తవాన్ని ధృవపరచింది. ఇదంతా అనంత విశ్వంలోను, అంతర్నిహితమైన శాస్ర్తియ విజ్ఞానం. ఇది సనాతనం. అంటే ఆద్యంతాలు లేని శాశ్వత విజ్ఞానం! పువ్వు ఒక తోటలో వికసిస్తుంది. అందువల్ల పువ్వు ఆ తోటది. కానీ పరిమళం ప్రపంచానికంతా విస్తరిస్తుంది. భగవద్గీత భారతీయ గ్రంథం. గ్రంథస్త సుగంధ సంస్కారం మాత్రం మొత్తం ప్రపంచానిది, జగత్తుది!
కానీ మతమే పరమావధిగా మనుగడ సాగిస్తున్న అనేక విదేశీయ జాతులకు ప్రతి అంశాన్ని మతదృష్టిలో చూసే సంకుచిత స్వభావులకు భారతీయమైన భగవద్గీతను మతాలకు వ్యతిరేకమన్న భ్రాంతి కలుగుతోంది! అందువల్ల ఇతర మతాలవారిని నిరంతరం తమ మతంలోకి మార్చడానికి యత్నిస్తున్న సంస్థలు, బృందాలు, ఉద్యమకారులు, ముఠా, భగవద్గీతను వ్యతిరేకిస్తున్నారు. రష్యాలో కూడా ఇదే జరుగుతోంది! అంతర్జాతీయ కృష్ణ్భక్త సమాజం వారి ప్రభావం పెరగడంవల్ల తమ మతానికి ప్రమాదకరమని రష్యా ‘అర్ధడాక్స్ చర్చి’ వారు భావిస్తున్నారట. ప్రమాదమని సామాన్య క్రైస్తవులు భావించడం లేదు!ఈ క్రైస్తవ సంస్థలు రష్యా అంతటా స్థానిక ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఒత్తిడికి లొంగిన స్థానిక పాలకులు కృష్ణ భక్తులపై ఆంక్షలు విధించడం రష్యాలో ప్రస్తుతం నడుస్తున్న కథ! ఏడేళ్ళక్రితం ‘కృష్ణ భక్తి సమాజం’ వారు నిర్మిస్తున్న దేవాలయాన్ని మాస్కో నగరపాలక సంస్థవారు అర్థాంతరంగా ఆపుచేయించారు. అలజడి చెలరేగిన తరువాత నిర్ధారిత స్థలంలో కాక, నగర శివార్లలోని ప్రాంతంలో మందిర నిర్మాణానికి అధికార్లు అనుమతిచ్చారు. ‘్థమ్‌స్కూ’ పట్టణ శివార్లలో ‘కృష్ణ సమాజం’ ఇళ్ళ సముదాయాన్ని నిర్మించడానికి అధికార్లు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలాంటి అంశాలను రష్యా కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి మన ప్రభుత్వం ఇప్పటికీ జంకుతూనే ఉంది! మన ప్రధాని ఇటీవల రష్యాకు వెళ్ళినప్పుడు ‘్భగవద్గీత’పై కోర్టులో నడుస్తున్న వివాదం గురించి ప్రస్తావించి ఉండవలసింది! మన ప్రభుత్వపు ‘జంకుతున్న’ వైఖరికి ఇది మహా నిదర్శనం.

భగవద్గీతపై పగ Bhagavat geeta
ఆహార సందేహం
ఆహార సందేహం!.December 22nd, 2011
మూడేళ్లుగా కొనసాగుతున్న అనేక సందేహాలకు సమాధానాలు లభించకపోవడం గురువారం పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చిన ‘జాతీయ ఆహార భద్రత’ బిల్లునకు నేపథ్యం. బిల్లును లోక్‌సభకు సమర్పించిన ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రి కె.వి.్థమస్ ఆ తరువాత ఇచ్చిన ‘వివరణ’ మరిన్ని సందేహాలను కలిగిస్తోంది. నిరుపేదలను నిర్థారించడానికి వీలుగా ‘ప్రణాళికా సంఘం’ వారు నిర్ణయించిన ‘కొలమానం’ ఆహార భద్రతను నిలదీస్తున్న విషయం మాత్రం మరోసారి స్పష్టమైపోయింది. బిల్లులో నిర్వచించిన ‘ప్రాధాన్య కుటుంబాల సంఖ్య’ దేశంలోని మొత్తం కుటుంబాలలో సగం కంటె తక్కువ అన్నది స్పష్టమైన మరో అంశం. అయితే గ్రామీణ ప్రాంతాలలో చౌక ఆహారం అవసరమైన డెబ్బయి ఆరు శాతం ప్రజలకు, పట్టణ ప్రాంతాలలోని ‘అవసరమైన’ యాభయి శాతం ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్నట్టు బిల్లులో పేర్కొన్నారు. ‘్భద్రత’ అవసరమైన కుటుంబాలను ఎలా నిర్థారించి ఈ ‘శాతా’లను కనిపెట్టారన్నదానికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు! ‘ప్రాధాన్యం’ కల కుటుంబాల సంఖ్య ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా నిర్థారించిన నిరుపేదల కుటుంబాల సంఖ్యతో దాదాపు సమానమట. ఈ సంగతిని ఆహార మంత్రి స్వయంగా అంగీకరించారు. ప్రణాళికా సంఘం వారు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిని మాత్రమే నిరుపేదలుగా గుర్తించారు. ఇలా గుర్తించిన తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది, ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు, విపక్షాలు విమర్శించాయ. కుటుంబాలు పెట్టే ఖర్చు ప్రాతిపదికగా దారిద్య్ర రేఖ దిగువన ఉన్నవారిని ప్రణాళికా సంఘం గుర్తించడం విమర్శలకు దోహదం చేసింది. ఈ ఖర్చుకు అత్యంత తక్కువ ‘గరిష్ఠ స్థాయి’ని విధించడం విమర్శలకు దారితీసిన మరో వైపరీత్యం! నిరుపేదలను నిర్థారించడానికి ప్రణాళికా సంఘం వారు మొదట 2006వ సంవత్సరం నాటి ధరలను ప్రాతిపదికగా తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టడంతో ప్రణాళికా సంఘం ప్రస్తుత ధరల ప్రాతిపదికగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని గుర్తించింది. గ్రామీణ ప్రాంతంలో సగటున ప్రతిదినం ఇరవై రూపాయలకంటె తక్కువ ఖర్చుచేసేవారు, పట్టణ ప్రాంతాలలో ముప్ఫయి రెండు రూపాయల కంటె తక్కువ ఖర్చుపెట్టేవారు మాత్రమే ‘దారిద్య్రరేఖకు దిగువన ఉన్న’ నిరుపేదలని గత సెప్టెంబర్‌లో ప్రణాళికా సంఘం నిర్ధారించింది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ప్రణాళికా సంఘం మాట మార్చింది. ఆహార భద్రత పథకం ప్రయోజనం పొందేవారిని గుర్తించడానికి ‘దారిద్య్రరేఖకు దిగువన ఉండడం’-బిపిఎల్- ప్రాతిపదిక కాబోదని వివరణ ఇచ్చింది. దేశంలోని అవసరమైన కుటుంబాల వారందరికీ చౌక ఆహారం సరఫరా చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రణాళికా సంఘం వారి ‘విచిత్ర నిర్థారణ’ ప్రాతిపదికగానే ప్రభుత్వం ‘ప్రాధాన్య కుటుంబాల’ను గుర్తించినట్టు ఇపుడు తెలిసిపోయింది. అంటే ‘బిపిఎల్’- కుటుంబాలకు మాత్రమే చౌక ధరలు వర్తిస్తాయన్నమాట! ఎటొచ్చీ ఈ కుటుంబాలను ‘దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు’ అని పిలవడం మాని ‘ప్రాధాన్యం కల కుటుంబాలు’ అని నిర్వచిస్తున్నారు. పేరు ఏదయితేనేమి? వైపరీత్యం మాత్రం అదే.
గురువారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం ప్రాధాన్యం కల కుటుంబాల వారికి మాత్రమే అతి చౌక ధరలకు బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు విక్రయిస్తారట! అవసరమైన కుటుంబాలవారందరికీ కాదన్నమాట! అంటే ‘ప్రాధాన్యం’ కల కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ కనీసం ఏడు కిలోల బియ్యం గోధుమలు ముతక ధాన్యం ఇస్తారట! మూడు రూపాయలకు బియ్యం, రెండు రూపాయలకు గోధుమలు, రూపాయికి ముతక ధాన్యం- సజ్జలు, జొన్నలు వంటివి- కిలో చొప్పున విక్రయిస్తారట! బాగుంది. కానీ ఏఏవి ఎనె్నన్ని కిలోలు ఇస్తారు? అన్న స్పష్టత లేదు. సాధారణ తరగతివారికి ఒక్కొక్కరికి నెలకు మూడు కిలోల ఆహార ధాన్యాలు లభిస్తాయట. ‘సాధారణ తరగతి’ అంటే ‘ప్రాధాన్యం’లేని ‘అవసరం ఉన్న’ కుటుంబాలు కావచ్చు! అంటే గ్రామీణ ప్రాంతాలలోని లాభోక్తులలో ఇరవై తొమ్మిది శాతం మందికి, పట్టణాలలోని లబ్దిదారులలో ఇరవై రెండు శాతం మందికి సగటున దక్కేవి నెలకు మూడు కిలోలన్నమాట! ఈమూడు కిలోలు కూడా రైతులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ‘కనీసపు మద్దతు ధర’ ప్రాతిపదికగా ఈ ‘అవసరమైన’ కుటుంబాలకు విక్రయించే ధరలను నిర్ణయిస్తారట! ఈ ధరలు ‘కనీసపు మద్దతు ధర’లో సగానికి- యాభై శాతానికి- మించి ఉండరాదన్నది మాత్రమే బిల్లులో పొందుపరచిన అంశం! అంటే ఈ వర్గాలకు లభించే మూడు కిలోల బియ్యం ధర కిలో పది రూపాయలు దాటిపోవచ్చు! ‘ఆహార భద్రత అవసరమైన’ కుటుంబాల సంఖ్యను నిర్ధారించేందుకు గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం ‘సర్వే’ జరిపిస్తోందట! ఈ ‘సర్వే’ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తికానున్నదట! కానీ ‘సర్వే’ పూర్తికాకుండానే కుటుంబాల శాతాన్ని ఎలా నిర్థారించారు? ‘సర్వే’లో ఏ ప్రాతిపదికగా ఈ కుటుంబాలను నిర్థారిస్తున్నారనే అంశాలను ప్రభుత్వం వెల్లడించకపోవడం ‘ఆహార భద్ర’పై సందేహాలు కలగడానికి అవకాశం ఇచ్చింది. పట్టణ ప్రాంతాలలో ఇలాంటి ‘సర్వే’ అసలు జరగడమే లేదు... మరి ఎలా ‘అవసరమైన’ కుటుంబాలను పసికట్టారు?
ఈ కొత్త పథకం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ముప్ఫయి వేల కోట్ల రూపాయలు అదనంగా వార్షిక వ్యయం ఏర్పడనున్నదట! ఈ ‘సబ్సిడీ’ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలని బిల్లులో నిర్దేశించారు. అయితే కేంద్రం వాటా ఎంత? అన్నది మాత్రం ఇంకా నిర్థారణ కాలేదు. ఈ ‘వాటా’ల సంగతి బిల్లులోనే ఎందుకని నిర్థారించలేదు? అలాంటి నిర్థారణ’కు కొన్ని రాష్ట్రాల అభ్యంతరాలు చెప్పడంవల్లనే కేంద్రం ‘ఆ ‘సంగతి’ని దాచిపెడుతోందన్న విమర్శకూడా వినబడుతోంది. అంతేకాక ఈ కేంద్ర పథకంతో సంబంధం లేకుండా అనేక రాష్ట్రాలలో ఇప్పటికే ‘సబ్సిడీ’పై ఆహార ధాన్యాలను విక్రయించే పథకాలను అమలు జరుపుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఉచితంగా బియ్యం సరఫరా చేస్తోంది నిరుపేదలకు... అలాగే మన రాష్ట్రంలోని నిరుపేదలకు రూపాయికి కిలో చొప్పున ప్రభుత్వం విక్రయిస్తోంది! ఇలాంటి రాష్ట్రాలలో ఈ కొత్త పథకంవల్ల లభించే ప్రయోజనం ఏమిటన్న చర్చ మొదలైపోయింది. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు జరుపరాదని తమిళనాడు ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం మొదలైపోయింది కూడా! దేశమంతటా ఒకే ధర ఉండాలనుకున్నట్టయితే రూపాయికే అన్ని రాష్ట్రాలలోను కిలో చొప్పున బియ్యం, గోధుమలు విక్రయించాలి! దానివల్ల పెరిగే భారాన్ని మోయడానికి కేంద్రం సిద్ధంగా లేదు! నిరుపేద బాలల భోజన పథకం, ‘అంత్యోదయ అన్న యోజన పథకం’ వంటి వాటిని కూడా ఈ కొత్త భద్రతా పథకంలో చేర్చనున్నారట! పదునాలుగేళ్ల లోపు బాలబాలికలకు మధ్యాహ్న భోజనం2 పెట్టాలన్నది లక్ష్యం! అలాంటపుడు అనేక రాష్ట్రాలలోని బడులలో ఇదివరకే అమలు జరుగుతున్న భోజన పథకాలను ఈ కొత్త పథకంలో విలీనం చేయనున్నారా? ‘ఆహారం’పై సబ్సిడీలను పెంచడానికి వీలుగా ఇంధనం చమురు వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసి, ఈ వ్యవస్థను అంతర్జాతీయ విఫణితో అనుసంధానం చేసే కార్యక్రమం ఇదివరకే మొదలైంది మరి! ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకుంటారా...?

ఆహార సందేహం Andhrabhoomi Editoral
నల్లడబ్బుపై ‘తెల్లకాగితం’
నల్లడబ్బుపై ‘తెల్లకాగితం’.December 15th, 2011
దేశ విదేశాల్లోని నల్లడబ్బును వెలికి తీసే కార్యక్రమం నత్తనడక నడుస్తోందన్న వాస్తవానికి గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలు మరో నిదర్శనం. స్విట్జర్లాండ్ తదితర దేశాలలో భారతీయ సంపన్నులు, పన్నులు ఎగవేసి దాచిన అక్రమ సంపదను బయటికి తీయడంలో జరుగుతున్న ‘ప్రగతి’ గురించి ఈ ఏడాది జనవరిలో చెప్పిన మాటలనే ప్రభుత్వం గురువారం లోక్‌సభలో చెప్పింది. ‘నల్లడబ్బు గురించి విదేశీయ ప్రభుత్వాలు సమకూర్చిన సమాచారాన్ని వెల్లడించడానికి వీలుకాదు..’ అన్న మాటను ప్రభుత్వం గత జనవరిలో చెప్పింది. సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇప్పుడు లోక్‌సభకు నివేదించింది. వెల్లడించడానికి వీలుగా విదేశాలతో ఒప్పందాలను కుదుర్చుకొనడానికై ఈ పదకొండు నెలలుగా ప్రభుత్వం ఏం చేసిందన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రతిపక్షాలు సైతం పార్లమెంటులో గర్జించి, గాండ్రించి, ఘీంకరించడం మినహా విదేశాలలోని నల్లడబ్బును వెలికి తీయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికై ప్రజలను చైతన్య పరచిన జాడలేదు. జర్మనీ బ్యాంకులో నల్లడబ్బు దాచిన వివరాలు ప్రభుత్వానికి లభించి సంవత్సరం దాటినా వాటిని ప్రజలకు చెప్పలేదు. ‘దేశాన్ని దోపిడీ చేసిన వారి వివరాలు రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు?’ అని సుప్రీంకోర్టు ప్రభుత్వం వారిని ప్రశ్నించి పదకొండు నెలలయింది. సమాధానం లేదు. అప్పుడు చెప్పిన మాటలనే గురువారం ప్రభుత్వం మళ్ళీ చెప్పింది. ‘‘నల్లడబ్బునకు సంబంధించి ముప్పయి ఆరువేల ‘వివరణ పత్రాలు’ విదేశాలనుంచి ప్రభుత్వానికి అందాయి. కానీ ఈ సమాచారాన్ని ప్రచురించినట్టయితే మనదేశం తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు ఏదో ఒక దేశం ఆరోపిస్తుంది. భవిష్యత్తులో ఆయా దేశాలు మనకు సమాచారం ఇవ్వవు. మన ‘వనరులు’ ఎండిపోతాయి!’’ అని ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ అంటున్నారు. ప్రజలకు వెల్లడి చేయడానికి అడ్డువస్తున్న ఒప్పందాలను సవరించుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్టు గత జనవరిలో చెప్పిన ప్రభుత్వం పదకొండు నెలలో ఈ దిశగా సాధించింది కూడా మరో ‘గుండు సున్న’! విదేశాలలోని బ్యాంకులలో ఇరవై అయిదు లక్షలకోట్ల రూపాయల మేరకు భారతీయుల ‘మురికి డబ్బు’ మూలుగుతోందన్నది భారతీయ జనతాపార్టీ అధినేత లాల్‌కృష్ణ అద్వానీ సేకరించిన సరికొత్త సమాచారం. ప్రణబ్ ముఖర్జీ ఇందుకు ‘దీటుగా’ మరికొంత సమాచారం బయటపెట్టారు. స్విస్ బ్యాంకులలోనే తొంభయి ఐదు లక్షలకోట్ల రూపాయల నల్లడబ్బు నక్కి ఉందన్నది ఆయనకు తెలిసిన సమాచారం. అంటే అద్వానీకి తెలిసింది చాలా తక్కువన్నమాట! అయితే ఈ స్విస్ బ్యాకుల నల్లడబ్బులో మన వాటా ఎంత అనేది ముఖర్జీకి తెలియదు! నల్లడబ్బుపై ఒక ‘తెల్లపత్రాన్ని’ మాత్రం ప్రభుత్వం రూపొందించి విడుదల చేస్తుందట! నల్లడబ్బు దాచిన వారి పేర్లు బయట పెట్టలేనప్పుడు దీని వల్ల ఒరిగేదేమిటి?
మన ప్రభుత్వం ఎనభయి రెండు దేశాలతో సమాచార వినిమయానికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ముఖర్జీ గురువారం వెల్లడించారు. దాదాపు ఇదే సంగతిని ఆయన గత జనవరిలో కూడా చెప్పివున్నారు. అరవై అయిదు దేశాలతో ఈ ఒప్పందాలు కుదిరిపోయినట్టు మరో పదిహేడు దేశాలతో కుదుర్చుకోనున్నట్టు ఆయన జనవరిలో వెల్లడించారు. ఈ ఒప్పందాలు రెండు ప్రధాన అంశాలకు సంబంధించినవి. ఆదాయంపై రెండుసార్లు పన్ను విధించడాన్ని నిరోధించే ఒప్పందం మొదటిది. ఆదాయం పన్నుల వివరాల వినిమయానికి సంబంధించిన ఒప్పందం రెండవది. ఈ ఒప్పందాల ప్రకారం మన ప్రభుత్వానికి ఆయా ప్రభుత్వాలు తమ దేశాల బ్యాంకులలో ఉన్న మనవారి ఖాతాల వివరాలను అందజేస్తున్నాయట! కానీ ఈ వివరాలను మన ప్రభుత్వం వెల్లడి చేయరాదట. ఇంక ఎందుకీ ఒప్పందాలు? జర్మనీలోని ‘లీటిన్ స్టీన్’ బ్యాంకులో నల్లడబ్బు దాచిన ఇరవై ఆరుమంది వివరాలు గత డిసెంబరులోనే ప్రభుత్వానికి అందాయి. ఈ పేర్లను మూసి ఉంచిన ‘కవర్’లో పెట్టి ప్రభుత్వం జనవరిలో సుప్రీంకోర్టుకు నివేదించింది. కానీ ఈ రెండు ఒప్పందాల కారణంగా ఈ నల్ల ఘరానాల పేర్లను వెల్లడించడానికి వీలుకాదని, సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. విచారణ మొదలై ఈ నిందితులపై అభియోగ పత్రాలను దాఖలు చేసిన తరువాత వారెవరో వెల్లడి అయిపోతుందని ప్రభుత్వం అప్పుడు చెప్పింది. మరి ఆ నిందితులను విచారించారా? ‘సిబిఐ’ వారు కానీ ఆదాయం పన్ను విభాగం వారి ‘కార్యాచరణ బృందం’వారుకానీ వారిని అదుపులోకి తీసుకున్నారా? అలా జరిగి ఉంటే వారిని న్యాయస్థానాల ఎదుట హాజరుపరచి ఉండాలి! ఏ న్యాయస్థానం ఎదుట హాజరు పరచారు? వారిని ‘జైలు’లోనే నిర్బంధించి ఉంచారా? లేక ‘బెయిలు’పై విడుదల చేశారా? ఈ ప్రశ్నలు, ఇలాంటి మరికొన్ని ప్రశ్నలను ప్రతిపక్షాలవారు పార్లమెంటులో అడగలేదు. మంత్రి సమాధానం చెప్పలేదు. పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం, నిందించుకొనడంతోనే సరిపోయింది. వాయిదా తీర్మానం వీగిపోయింది!
జర్మనీ బ్యాంకులో డబ్బు దాచినవారపై కోర్టుల్లో విచారణ ఎప్పుడు మొదలవుతుంతో ప్రజలకు తెలియవలసి వుంది. నల్లడబ్బును విదేశాలనుండి రప్పించడానికి, దాచినవారిని బహిరంగంగా న్యాయస్థానాల ముందు నిలబెట్టడానికి వీలుగా, సంబంధిత ఒప్పందాలను సవరించడానికి మన ప్రభుత్వం చేయనున్న ప్రయత్నాల గురించి, అవలంబించే విధానం గురించి వివరాలు వెల్లడి కావలసి ఉంది. అమెరికా ప్రభుత్వం, ఐరోపా దేశాల ప్రభుత్వాలు స్విట్జర్లాండ్‌లోని కొన్ని బ్యాంకులతో ఒప్పందాలను కుదుర్చుకొనడం ద్వారా తమ దేశాలకు సంబంధించిన నల్లధనం కామందులను పట్టుకోగలిగాయి. ఈ దేశాలకు ఆయా బ్యాంకులతో కుదిరిన ఒప్పందాల గురించి మన ప్రభుత్వమే ధ్రువీకరించింది. మరి మన ప్రభుత్వం ఆయా బ్యాంకులతో నేరుగా ఎందుకని ఒప్పందాలను కుదుర్చుకోవడం లేదు? వ్యక్తుల వివరాలు వెల్లడి చేయడానికి స్విట్జర్లాండ్‌లోని మరికొన్ని బ్యాంకులు సిద్ధంగా లేవు. అలాంటి బ్యాంకులతో ఐరోపా దేశాలు, ఇతర దేశాలు మరోరకం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నిజానికి ఇది స్విట్జర్లాండ్ బ్యాంకులకు, ఆ దేశ ప్రభుత్వానికి, ఇతర దేశాలకు మధ్య కుదిరిన త్రైపాక్షిక అంగీకారం! 2005 నుండీ ఐరోపా దేశాలకు ఇలాంటి ఒప్పందం వల్ల ప్రయోజనం కలుగుతోంది. ఈ ఒప్పందం ప్రకారం స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో డబ్బు దాచిన విదేశీయుల పేర్లు మాత్రమే వెల్లడికావు. కానీ రహస్య ఖాతాలలోని నల్లధనంపై వచ్చే వడ్డీలో డెబ్బయి ఐదుశాతాన్ని బ్యాంకులవారు ఆయా దేశాల ప్రభుత్వాలకు చెల్లిస్తారు. వడ్డీలో ఇరవై ఐదుశాతం మాత్రం నల్లధనం దాచిన ఘరానా ఖాతాదార్లకు లభిస్తోంది. తేలుకుట్టిన దొంగవలె నల్లధనం ఖాతాదారలు నోరుమూసుకొని ఉన్నారు. వారు ఈ ఖాతాలలోని ‘అసలు’ను ఉపసంహరించుకోలేరు. అలా ఉపసంహరించుకున్న వారి పేర్లను స్విడ్జర్లాండ్ బ్యాంకులు వెల్లడిస్తాయి. అందువల్ల ఈ నల్లధనంలో డెబ్బయి ఐదుశాతం ఆయా దేశాల ప్రభుత్వాలకు మూలధనంగా మారింది. శాశ్వతంగా వడ్డీలోని మూడు వంతులు ఆయా దేశాల ప్రజలకు దక్కుతోంది. ఇలాంటి ఒప్పందాన్ని సైతం మన ప్రభుత్వం ఇంతవరకు కుదుర్చుకోలేదు! కుదుర్చుకున్నట్టయితే వడ్డీ విలువ ఎన్నివేలకోట్లన్నది తెలుస్తుంది. తద్వారా నల్లడబ్బు మొత్తం విలువ నిర్ధారించవచ్చు! కానీ ప్రభుత్వం కదలదు!!

‘పాలన’ వివాదం!.
‘పాలన’ వివాదం!.December 14th, 2011
లోక్‌పాల్ బిల్లును వ్యతిరేక దిశలలో లాగడానికి కేంద్రం, అన్నాహజారే బృందం, కృతనిశ్చయులై ఉన్నారన్నది స్పష్టమైపోయిన సత్యం. పార్లమెంటు స్థారుూ సంఘం వారు చేసిన సిఫార్సులను కొన్నింటిని, ఆమోదించకపోవడం ద్వారా ప్రభుత్వంవారు హజారే బృందానికి ఆగ్రహం తెప్పించారు. అన్ని రాజకీయ పక్షాల మధ్య దాదాపు ఏకాభిప్రాయం కుదిరిన సమయంలో కేవలం ఒక్క అంశం గురించి ‘తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న’ విధానాన్ని హజారే బృందం వారు పునః ప్రారంభించడం విలంబన పథంలో సంభవించిన మరో వైపరీత్యం. లోక్‌పాల్ పాలనా అధికార పరిధిలోని ‘సిబిఐ’ని చేర్చాలనేది హజారే బృందం పట్టు! ఈ కోరికను అంగీకరించకపోయినట్టయితే హజారే ఈనెల 27వ తేదీ నుంచి మళ్ళీ నిరాహార దీక్షను ఆరంభించనున్నారు. ఆలోగా ‘కోరిక’ను అంగీకరించినట్లయితే 27వ తేదీన ఉత్సవం జరుపుతారట. ‘లోక్‌పాల్’ బిల్లు ఈ సమావేశంలో పార్లమెంటు ఆమోదం పొందదు. 22వ తేదీన పార్లమెంటు సమావేశాలు ముగిసిపోనున్నాయి. అంటే ఈ సమావేశాల సందర్భంగా ‘లోక్‌పాల్ బిల్లు’ను పార్లమెంటు ఆమోదించకపోయినప్పటికీ ఫర్వాలేదని హజారే బృందం వారు భావిస్తున్నట్టే కదా! ఈ సమావేశాల్లోనే ‘బిల్లు’ ‘చట్టం’ కావాలని చెబుతున్న వారు ఇలా 27వ తేదీ వరకు గడువును పొడిగించడం పరస్పర విరుద్ధమైన వైఖరులకు అద్దం పడుతోంది. గత ఎనిమిది నెలలకు పైగా జరిగిన చర్చలు నడచిన ఉద్యమాలు, చెలరేగిన విభేదాలు, కుదిరిన ఏకాభిప్రాయాలు ‘లోక్‌పాల్’ న్యాయాధికార పరిధి గురించి మాత్రమే. ఇప్పుడు ‘సిబిఐ’పై ‘లోక్‌పాల్’కు ‘పాలనాధికారం’ ఉండాలన్న కోర్కె ప్రధానమైపోయింది. ప్రధానమంత్రి పదవిలో ఉన్నవారిపై వచ్చే అభియోగాలను విచారించే హక్కు ‘లోక్‌పాల్’కు లభించడంవల్ల రాజకీయ విభేదాలు సమసిపోయినట్టే. ‘లోక్‌పాల్’కుండవలసిన న్యాయాధికారం పరిధి ఇందువల్ల విస్తరించింది. అందువల్ల పాలనాధికారం గురించి పేచీలు పెట్టడం ఈ దశలో అనవసరం.
స్థారుూ సంఘంవారు ప్రధానమంత్రిని లోక్‌పాల్ న్యాయాధికార పరిధిలోకి చేర్చలేదు. అలా చేర్చిన ‘ఘనత’ మంత్రివర్గానికి అధికార భాగస్వామ్య పక్షాలకు దక్కింది. ‘సిబిఐ’ గురించి స్థారుూ సంఘం చేసిన సిఫార్సును ప్రభుత్వ పక్షాలు తోసిపుచ్చాయి. ఇలా ‘స్థారుూ సంఘం’ తుది నివేదిక విప్లవాత్మకమైన పరిణామాలకు గురికావడం ప్రభుత్వం ఆడిన నాటకంలో భాగం. ప్రభుత్వం ఆగిన చోటనుండి హజారే బృందం వారు అందుకున్నారు! ఆలస్యం చేయడమే లక్ష్యం!! ప్రభుత్వ నిర్వాహకులైన రాజకీయ వేత్తల కనుసన్నలలో మెలుగుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ , ఆదాయం పన్ను విభాగం వారి ‘కార్యాచరణ మండలి’ వంటి సంస్థలు సాధారణంగా దర్యాప్తును ఆరంభించవు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించేవరకు ‘సిబిఐ’లో కదలిక రాకపోవడం సమీప గతంలో జరిగిన పరిణామాల వల్ల ధ్రువ పడిన వాస్తవం. రెండవశ్రేణి టెలికామ్ తరంగాల కేటాయింపునకు, కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణకు సంబంధించిన కుంభకోణాల దర్యాప్తులు ఇందుకు నిదర్శనం. సుఖ్‌రామ్ వంటి మాజీ కేంద్రమంత్రిపై విచారణ ప్రక్రియను 1996 నుంచి ‘అప్పీళ్ళకప్పీల’ను దాటలేకపోతోంది. ‘లోక్‌పాల్’ వ్యవస్థీకృతమైన తరువాత ఇలాంటి న్యాయ విలంబాన్ని నిరోధించవచ్చు. ప్రథమ ఆరోపణ పత్రం దాఖలైన తరువాత ఏడేళ్ళ లోగా దర్యాప్తు, విచారణ పూర్తిఅయి తీర్పులు వెలువడాలని లోక్‌పాల్ బిల్లు నిర్దేశిస్తోంది కనుక ఈ నిబంధన న్యాయ ప్రక్రియ వేగవంతం కావడానికి అంకుశం వలె ఉపకరిస్తుంది. కేంద్రమంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నేర విచారణ విధాన స్మృతి లోని నిబంధనల మేరకు రాష్టప్రతి అనుమతి కావాలి. అలాగే అత్యున్నత స్థాయిలోని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులపై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో దర్యాప్తులు జరపడానికిప్రభుత్వం అనుమతి ప్రసాదించాలి. ‘లోక్‌పాల్’ న్యాయస్థానం వారు ఇలాంటి అనుమతులతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా దర్యాప్తునకు ఆదేశించగలరు. అభియోగపత్రం దాఖలయిన తరువాత సత్వర విచారణ జరిపి తీర్పులు చెప్పగలరు. దశాబ్దుల తరబడి దర్యాపులు నడిచిపోతుండటం, నేరాల తీవ్రత తద్వారా నీరుకారిపోవడం, నిందితులు మరణించడం, నేరస్థులు నిర్దోషులుగా బయటపడడానికి వీలు కలగడం వంటి వైపరీత్యాలను ‘లోక్‌పాల్’ వ్యవస్థ నిరోధించగలదు. ‘లోక్‌పాల్’ వ్యవస్థకు అంకురార్పణ జరగగానే ఉన్నతాధికారులు, అత్యున్నత అధికార రాజకీయవేత్తలు, ప్రజాప్రతినిధులు నిజాయతీపరులుగా మారిపోవడం కల్ల. అవినీతి ఆరోపణల గురించి కొంత వేగంగాను, మరికొంత సరళంగాను నిగ్గు తేల్చడానికి మాత్రమే ‘లోక్‌పాల్’ వ్యవస్థ ఉపయోగపడగలదు.
దర్యాప్తులపై ‘లోక్‌పాల్’ నియంత్రణ గురించి వివిధ రాజకీయ పక్షాలు స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ, ఈ దర్యాప్తుపై లోక్‌పాల్‌కుండే అధికార పరిధి గురించి స్పష్టమైన నిబంధనలు రూపొందలేదు. దర్యాప్తును ప్రారంభించడానికి ముందు ‘సిబిఐ’ వారు లోక్‌పాల్ అనుమతిని తీసుకోవాలన్నది పార్లమెంటరీ స్థారుూ సంఘం వారు తమ తుది నివేదికలో విధించిన నిబంధన. ఈ నిబంధనను ‘సిబిఐ’ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు రాజకీయ పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ‘సిబిఐ’ను లోక్‌పాల్ పరిధినుంచి మినహాయించారు. ప్రధానమంత్రి పదవిలో ఉండే వారిపై వచ్చే ఆరోపణలను ‘లోక్‌పాల్’ న్యాయస్థానం వారు ఆయా ప్రధాన మంత్రులు పదవులను పరిత్యజించిన తరువాత విచారించాలని స్థాయా సంఘం మరో ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాన అమలు జరిగినట్టయితే అవినీతి గ్రస్తులైన ప్రధానులు అనేక ఏళ్ళపాటు విచారణంను వాయిదా వేసి హాయిగా పదవులలో కొనసాగవచ్చు. ‘సి’ తరగతి ప్రభుత్వ ఉద్యోగులను ‘లోక్‌పాల్’ పరిధినుంచి మినహాయించాలన్నది స్థారుూ సంఘం వారి మరో ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను కూడా రాజకీయ పక్షాలు తిరస్కరించాయి. లోక్‌పాల్‌కు అనుబంధంగా ఏర్పాటయ్యే ‘అంబుడ్స్‌మాన్’ పరిధిలోకి ‘సి’ తరగతి ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చే ఆరోపణలను చేర్చుతారట. ‘సిబిఐ’ వారు స్వతంత్రంగా దర్యాప్తు చేసే నేరాలకు సంబంధించిన అభియోగాలను లోక్‌పాల్‌కు నివేదించాలా? లేక ప్రత్యేక న్యాయస్థానాలకు నివేదించాలా? అన్న విషయం గురించి కూడా స్పష్టత ఏర్పడలేదు. ప్రస్తుతం సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దర్యాప్తు సంస్థ. కేంద్ర ప్రభుత్వం నిర్వాహకులు ‘సిబిఐ’ని అనధికారికంగా అదుపు చేయడం రాజకీయ సమస్య. కానీ సిబిఐని పూర్తిగా ‘లోక్‌పాల్’కు అనుబంధంగా మార్చడం అభిలషణీయం కాదు. ప్రభుత్వ పాలనా పరిధి నుంచి ‘సిబిఐ’ను తప్పించ దలచుకున్నట్టయితే ఆ విభాగాన్ని సుప్రీంకోర్టు ఆజమాయిషీ కిందికి తేవచ్చు. ‘లోక్‌పాల్’ తీర్పులను సైతం సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. సిబిఐ మాజీ డైరెక్టర్ ఆర్‌కె రాఘవన్ వంటి వారు ‘సిబిఐ’పై ‘లోక్‌పాల్’కు పాలనా సంబంధమైన అధికారం ఉండవచ్చునని సూచిస్తున్నారు. అన్నా హజారే బృందంవారు ‘సిబిఐ’ని ‘లోక్‌పాల్’ పాలనాధికార పరిధిలో చేర్చాలని పట్టుబట్టడానికి ఇలాంటి సూచనలు కారణం కావచ్చు. ఏమయినప్పటికీ ప్రస్తుత సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ‘లోక్‌పాల్’ బిల్లునకు ఆమోదం లభించబోదన్నది స్పష్టమవుతున్న అంశం..

lokpal bill edit andhrabhoomi
కోర్టుకెక్కిన కృష్ణ
కోర్టుకెక్కిన కృష్ణ.December 10th, 2011
పదవికి రాజీనామా చేయకపోవడం ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణ మరో అసమంజసమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఈ దుష్ట సంప్రదాయం వ్యవస్థీకృతమయినట్టయితే న్యాయస్థానాల్లో తమకు వ్యతిరేకంగా ‘్ఫర్యాదుపత్రం’-ఎఫ్‌ఐఆర్- దాఖలయినప్పటికీ కేంద్రమంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇతర మంత్రులు కానీ తమ పదవులకు రాజీనామా చేయనక్కరలేదు. ఎస్‌ఎం కృష్ణ తమ పదవికి రాజీనామా చేయాలని కోరుతూ శుక్రవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాల సభ్యులు యథావిధిగా గందరగోళం సృష్టించారు. సభలు వాయిదా పడడం మినహా వారు సాధించింది లేదు. కృష్ణ పదవిని వదిలిపెట్టలేదు. కర్నాటకలోని లోకాయుక్త న్యాయాలయంలో పోలీసులు దాఖలు చేసిన ‘ఎఫ్‌ఐఆర్’ ప్రాతిపదికగా తదుపరి చర్యలు తీసుకోకుండా నిరోధించాలని కోరుతూ ఆయన హైకోర్టులో ‘పిటిషన్’ దాఖలు చేశారు. కర్నాటక ముఖ్యమంత్రిగా ఉండిన సమయంలో కృష్ణ అవలంబించిన విధానం కారణంగా ‘ప్రైవేట్ కంపెనీ’ల కామందులు భారీగా ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి వీలు కలిగిందన్నది ప్రధాన ఆరోపణ. 1999, 2004 సంవత్సరాల మధ్య కర్నాటక ముఖ్యమంత్రిగా ఉండిన కృష్ణ ‘రక్షిత అటవీ భూముల’ను సాధారణ అటవీ భూములుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారట. దీనివల్ల వేలాది ఎకరాల రక్షిత అటవీ ప్రాంతంలో ఇనుపఖనిజాన్ని ఇతర ఖనిజాన్ని తోడేయడానికి కార్పొరేట్ వాణిజ్య సంస్థలకు అనుమతి లభించిందని ‘సమాచార’ ఉద్యమకారుడు టిజె అబ్రహం గత నెల 29న లోకాయుక్తకు ఫిర్యాదు దాఖలు చేసాడు. తమకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదులు అందిన వెంటనే పదవులకు మంత్రులు రాజీనామా చేయడం ఒకప్పటి సత్సంప్రదాయం. కృష్ణకంటే ముందు ఇలా మొండికెత్తిన రాష్ట్ర మంత్రులు కేంద్రమంత్రులు ఉన్నారు. కానీ ఏ రాజా వంటి భారీ కుంభకోణగ్రస్తులు సైతం కోర్టులో ‘ఎఫ్‌ఐఆర్’ దాఖలయిన వెంటనే రాజీనామా చేసారు. కానీ కృష్ణకు వ్యతిరేకంగా న్యాయ ప్రక్రియ మూడు దశలను దాటింది. ‘ఆర్‌టిఐ’ ఉద్యమకారుడు ఫిర్యాదు చేయడం మొదటి దశ. ఈ ఫిర్యాదు ప్రాతిపదికగా దర్యాప్తు జరుపవలసిందిగా లోకాయుక్త న్యాయస్థానం వారు ఈనెల 3న పోలీసులను ఆదేశించారు. పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానానికి సమర్పించారు. కృష్ణపై వచ్చిన ఆరోపణలు నిజమని విశ్వసించడానికి తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండటం వల్ల మాత్రమే పోలీసులు ఇంతటి సాహస కార్యానికి పూనుకున్నారు. అలాంటి ఆధారాలు లేనట్టయితే లోకాయుక్త, పోలీసులు కాని, ఇతర దర్యాప్తు విభాగాల అధికారులు కానీ ఒక ప్రముఖ కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ‘ఎఫ్‌ఐఆర్’ దాఖలు చేసే దుస్సాహసానికి ఒడిగట్టరు.
గనుల కుంభకోణానికి శ్రీకారం చుట్టిన విధానాన్ని ఆరంభించింది ఎస్‌ఎం కృష్ణ కాగా ఆతరువాత ముఖ్యమంత్రి పదవులను చేపట్టిన ధరమ్ సింగ్, హెచ్‌డి కుమారస్వామి భారీగా అటవీ భూములను గనుల కామందులకు అప్పగించారన్నది ఫిర్యాదుదారుని ప్రధాన ఆరోపణ. ఎడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉండిన సమయంలో అక్రమంగా గనులను తవ్వడం ప్రభుత్వ నిఘా కన్నుగప్పి ఇనుప ఖనిజాన్ని తరలించడం వంటి కలాపాలు పరాకాష్టకు చేరడం వేరే కథ. అవినీతి మూటల బరువుకు ఎడియూరప్ప మంత్రివర్గం కూలిపోయింది. వేలాది కోట్ల రూపాయలు దోచిన మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి కటకటాలను లెక్కపెడుతున్నాడు. గాలి జనార్థన రెడ్డిని పట్టుకున్నది సిబిఐ కాగా, ఎడియూరప్ప మాత్రం లోకాయుక్తకే దొరికిపోయాడు. తవ్వినకొద్దీ అవినీతి కుంభకోణాలు బయటపడుతుండటానికి కృష్ణపై కేసు దాఖలు కావడం మరో ఉదాహరణ. ధరమ్‌సింగ్‌కు, కుమారస్వామికి వ్యతిరేకంగా ‘ఎఫ్‌ఐఆర్’ దాఖలు కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ ‘మచ్చ లేని రాజకీయ వేత్త’గా కర్నాటక కాంగ్రెస్ వారు ప్రచారం చేసిన ఎస్‌ఎం కృష్ణ ‘బండారం’ ఇలా బయటపడడమే విస్మయకరం. ఇనుప ఖనిజాన్ని, అభ్రకపు ఖనిజాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఒకచోట నుంచి మరొక చోటికి తరలించడానికి, రాష్ట్రం సరిహద్దులను దాటించడానికి వీలుగా ప్రైవేట్ కంపెనీలకు అక్రమంగా అనుమతి పత్రాలను మంజూరు చేసారనేది ధరమ్‌సింగ్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదు పత్రంలోని సారాంశం. ఇలా ఇనుప ఖనిజాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా కర్నాటక బయటకి దాటించే ‘కళ’లో ‘బళ్ళారి’ గాలి సోదరులు పేరు మోయడానికి ఈ అక్రమ అనుమతి పత్రాలు కారణం. ‘శ్రీ వేంకటేశ్వర మినరల్స్’, ‘జనతాకల్ మైనింగ్ కార్పొరేషన్’ అన్న వాణిజ్య సంస్థలకు కుమారస్వామి ఐదువందల ఎకరాల సురక్షిత అటవీ ప్రాంతాన్ని అప్పగించాడట. ఈ రెండు ఫిర్యాదు పత్రాలలోని ఆరోపణలతో పోల్చినప్పుడు కృష్ణ చేసిన ‘నేరం’ అంతపెద్దది కాకపోవచ్చు. కానీ ఆయన ప్రారంభించిన ‘విధానమే’ తదుపరి జరిగిన అవినీతి గనుల తవ్వకాలకు ‘ప్రాతిపదిక’ అన్నది ఫిర్యాదిదారుని వాదం. ఈ ముగ్గురి బంధువులు అనేక గనుల తవ్వకాల సంస్థలలోను, ఖనిజ వ్యాపారాలలోను భారీగా పెట్టుబడులు పెట్టారట. కుమారస్వామిపై గతంలో దాఖలయిన మరో ఫిర్యాదును హైకోర్టు తోసిపుచ్చింది. ఫిర్యాదు దారుడు ఆషామాషీగా ఆరోపణలను చేశాడని, అందువల్ల అతగాడు లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని కూడా హైకోర్టు నిర్ధారించింది.
అందువల్లనే బహుశా కృష్ణ ఇప్పుడు హడావుడిగా హైకోర్టుకెక్కాడు. కుమారస్వామికి లభించినట్టుగా తనకు కూడా హైకోర్టులో ‘న్యాయం’ జరుగుతుందని ఆయన ధీమా కాబోలు. కానీ లోకాయుక్త న్యాయస్థానంవారు ఎఫ్‌ఐఆర్ ప్రాతిపదికగా ఎలాంటి ఆదేశాలను జారీ చేయకముందే హైకోర్టుకెక్కడం గుర్రానికి ముందు బండిని కట్టేసినట్టయింది. న్యాయస్థానంలో హాజరు కావాలంటూ లోకాయుక్త కృష్ణకు ‘సమన్లు’ జారీ చేయలేదు. ఆయనను అరెస్ట్ చేయవలసిందిగా పోలీసులను ఆదేశిస్తూ ‘వారెంటు’ పంపలేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగిన తర్వాత మాత్రమే హైకోర్టులో ‘పిటిషన్’ దాఖలు చేసి ఉండవలసింది. తక్షణం చేసి ఉండవలసిన పని పదవిని పరిత్యజించడం. అలా చేసివుండినట్లయితే ‘మచ్చలేని నాయకుడన్న’ ప్రచారానికి సార్ధకత ఏర్పడివుండేది.‘రక్షిత అటవీ భూములలో గనుల తవ్వకాలకు అనుమతి ఇవ్వరాదని’ ముఖ్యమంత్రిగా వుండిన సమయంలో కృష్ణకు సంబంధిత మంత్రిత్వ విభాగం కార్యదర్శి లిఖిత పూర్వకంగా సలహా ఇచ్చాడట! కానీ ఈ సముచిత సూచనను కృష్ణ నిర్ద్వద్వంగా తిరస్కరించాడట. ఈ ‘నిర్ణయం’ అనేక ఏళ్ళుగా ఖనిజాలను దోచిపారేస్తున్న ‘కామందులకు’ తలుపులు తెరచిందన్నది ఫిర్యాదు పత్రంలోని ప్రధానాంశం. విదేశాంగ మంత్రిగా కృష్ణ మందగొడితనానికి మారుపేరుగా ప్రసిద్ధి కెక్కాడు. ఆయన నైతిక నిష్టను గురించి ఎవరూ వేలెత్తలేదు! కృష్ణ నిజాయతీపరుడన్న కారణంగానే గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రచారం చేసింది. ఇందుకోసం ఆయన మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది! మరి ఇప్పుడెందుకు రాజీనామా చేయరు?

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)