9, ఫిబ్రవరి 2020, ఆదివారం

‘నిర్మాణ’ నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘ఎప్పటి రాముడు సీతమ,
ఎప్పటి లక్ష్మణుడు ఎన్ని ఏళ్లు గతించెన్?!
ఇప్పటికి కరకు మాయల!
అప్పటి వాల్మీకి రచనల జరామరమై..’’
శివారెడ్డి శేషురెడ్డి అన్న ప్రజాకవి అభివర్ణించిన తీరు ఇది! వాల్మీకి మహర్షి ప్రపంచంలో ఆదికవి మాత్రమే కాదు, మొట్టమొదటి చరిత్రకారుడు. ఆయన రచించిన ‘రామాయణమ్’ కావ్యం మాత్రమే కాదు, ఇతిహాసం కూడ. ‘ఇతిహాసం’అని అంటే ఆధునిక పరిభాషలో చరిత్ర... రామాయణమ్, మహాభారతం ఇతిహాస గ్రంథాలన్నది తరతరాల జన జీవన వాస్తవం. ఈ రెండు జాతీయ చారిత్రక గ్రంథాలలోని మానవులు కల్పిత పాత్రలు కాదు, వారు మన దేశంలో పుట్టి పెరిగి జీవించినవారు!! తమ సమకాలంలోని ఈ వాస్తవ మహాపురుషుల చరిత్రను వాల్మీకి ‘రామాయణమ్’ ద్వారాను, కృష్ణ ద్వైపాయన వ్యాసుడు ‘మహాభారతమ్’ ద్వారాను గ్రంథస్థం చేశారు!! ఈ ఇద్దరు జాతీయ చరిత్రకారుల రచనలవల్ల రఘుకుల రాముడు, యదుకుల కృష్ణుడు ఈ దేశంలో పుట్టిపెరిగిన మహాపురుషులని, భరతమాత వజ్రాల బిడ్డలని తరతరాలుగా ధ్రువపడింది! అందువల్ల వీరిద్దరు, వీరిద్దరి చరిత్రను చెప్పిన వారిద్దరూ, వీరి సమకాలంలోను, వీరికి పూర్వం, వీరి తరువాత కూడ ఈ దేశంలో పుట్టిపెరిగిన అసంఖ్యాక మహనీయులూ కూడ జాతీయ మహాపురుషులు, భరతమాతృ కీర్తిపతాకలు, జాతీయ సంస్కృతి ప్రతీకలు, తరతరాల స్వజాతీయులకు స్ఫూర్తిప్రదాతలు... వందనీయులు! అందువల్ల అయోధ్య రామజన్మభూమి కాని, మధురలోని కృష్ణ జన్మభూమి కాని జాతీయ సముత్కర్ష గరిమకు చారిత్రక సాక్ష్యాలు! అందువల్ల కుల, మత, భాషా ప్రాంత వైవిధ్యాలకు అతీతంగా జాతి ప్రజలందరూ రఘురాముని, యదుకృష్ణుని తమ పూర్వులుగా గుర్తించి గౌరవించాలి. ఆరాధించాలి! అబ్దుల్‌కలాం వలె, గాంధీ మహాత్ముని వలె, సుభాష్ చంద్రవసు వలె, వివేకానందస్వామి వలె, ఛత్రపతి శివాజీ వలె, విక్రమ శాలివాహనుల వలె, ఆదిశంకరాచార్యుని వలె రఘరాముడు, యదుకుల కృష్ణుడు ఈ దేశ ప్రజలందరికీ జాతీయ మహాపురుషులు! అందువల్ల ‘రామజన్మభూమి’ మతాల మధ్య వివాదంగా పరిణమించి ఉండరాదు!! మతాలు, భాషలు, ఇతరేతర వైవిధ్యాలు అనేకం ఉన్నప్పటికీ మన దేశ ప్రజలు అనాదిగా ఒకే ‘జాతి’గా వికసించారు, ఒకే సంస్కృతి నిబద్ధులయ్యారు!! అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ‘పదిహేను సభ్యుల స్వతంత్ర మండలి’ని నిర్మించడం ఈ అద్వితీయ జాతీయ నిరంతర ప్రస్థాన క్రమంలో, అందువల్ల, మరో సముజ్వల ఘట్టం!!
నిజానికి ఇది మందిర పునర్ నిర్మాణ కార్యక్రమం!! ‘రామజన్మభూమి’ వివాదగ్రస్తం కావడం ఇందుకు నేపథ్యం! బ్రిటన్ దురాక్రమణ సాగిన కాలంలో సంభవించిన వైపరీత్యాలు ఇందుకు కారణం... బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు మన చరిత్రను- యుగయుగాల కోట్ల ఏళ్ల చరిత్రను- చెఱచారు, ఈ చరిత్ర కేవలం ‘‘కల్పన’’-మిత్-గా చిత్రీకరించారు, ప్రచారం చేశారు, విద్యాలయాలలో బోధించారు. ఫలితంగా బ్రిటన్ ముష్కరులు అంగీకరించిన ఆధునిక చరిత్ర లేదా కలియుగ చరిత్ర మాత్రమే చరిత్రగా మిగిలింది. ఈ ఆధునిక చరిత్రలో సైతం బ్రిటన్ విబుధ దైత్యులు అనేక వక్రీకరణలను చొప్పించారు. బ్రిటన్‌వారు అంగీకరించని పూర్వయుగాల భారతీయ చరిత్ర లేదా హైందవ జాతీయ చరిత్ర ‘‘కాల్పనిక సాహిత్యం’’- మైథాలజీ-గా ముద్ర పడింది. ఈ ‘ముద్ర’కారణంగా మన దేశంలోని చారిత్రక పురుషులు ‘‘కల్పిత పాత్రలు’’గా మారిపోయారు. ఈ ‘‘ముద్ర’’ను తొలగించుకొని జాతీయ చరిత్రను చరిత్రగా పునరుద్ధరించుకున్నట్టయితే రఘురాముడు, యదుకుల కృష్ణుడు వంటి వారు ‘‘కల్పిత పాత్రలు’’కాదని, వారు నిజమైన చారిత్రక పురుషులని ఈ దేశ ప్రజలందరూ అంగీకరిస్తారు. గతంలోనే ఈ ముద్ర తొలగి ఉండినట్టయితే రఘురాముని జన్మస్థలంపై వివాదమే ఏర్పడి ఉండేది కాదు... రామజన్మభూమి మందిర పునర్ నిర్మాణంతోపాటు ఈ జాతీయ చరిత్రను పునరుద్ధరించడం అనివార్యం కావాలి!
ఉదాహరణలను ఎన్నింటినైనా చెప్పవచ్చు... మతం దేశంలోని ఒక జన సముదాయం, వివిధ మత జన సముదాయాల సమష్టి సమాహారం జాతి! అందువల్ల మొత్తం జాతికి సంబంధించిన జాతీయ మహాపురుషులు అన్ని మతాలకు ఆరాధ్యులు, మొత్తం జాతికి సంబంధించిన చరిత్ర అన్ని మతాల వారిది... మొత్తం జాతికి సంబంధించిన సంస్కృతి పట్ల అన్ని మతాలవారు సమైక్యభావ బద్ధులు కావాలి! మొత్తం జాతికి సంబంధించిన మాతృభూమి అన్ని మతాలవారికీ సమానంగా తల్లి! జాతీయ హితం సర్వమత జన సముదాయం. ఇదీ జాతీయ వికాసక్రమానికి సహజ భూమిక! ఈ మతాలు అనాదిగా ఈ దేశంలో పుట్టిపెరిగాయి, కొన్ని విదేశాలనుంచి వచ్చాయి, వ్యాపించాయి. ఏమయినప్పటికీ ఉప నదులన్నీ మహానదిలో కలసినట్టుగా మతాల ప్రవాహాలన్నీ జాతీయ మహాస్రోతస్వినిలో సంలీనం కావడం సహజ పరిణామం కావాలి! ఇలా జరుగకుండా బ్రిటన్ ముష్కరులు కుట్ర పన్నారు. వివిధ మత సమాహారమైన ఈ దేశపు సనాతన జాతీయతను బ్రిటన్ మేధావులు కేవలం ఒక ‘మతం’గా చిత్రీకరించారు. ఫలితంగా అనాది జాతీయ అస్తిత్వమైన హిందుత్వం లేదా భారతీయత కేవలం ఒక ‘మతం’స్థాయికి దిగజారిందన్న భ్రమ వ్యాపించింది. రఘురాముడు, యదుకృష్ణుడు వంటి జాతీయ మహాపురుషులు కేవలం ఒక మతానికి మాత్రమే చెందిన వ్యక్తులన్న భ్రాంతి వ్యాపించింది, ‘జాతీయ తత్త్వము’ ‘‘మతోన్మాదమన్న భ్రాంతి’’ వ్యాపించింది! రామజన్మభూమి మందిర నిర్మాణంతోపాటు ఈ దేశపు వౌలిక జాతీయ అస్తిత్వం కేవలం ఒక మతమన్న భ్రమను తొలగించడానికి కృషి జరగాలి! హిందుత్వం లేదా భారతీయత ‘మతం’కాదన్న, సర్వమత సంపుటమైన జాతి అన్న వాస్తవం మళ్లీ వెలగాలి!! అమెరికాలోని అన్ని మతాలవారు జార్జివాషింగ్‌టన్, అబ్రహామ్ లింకన్ వంటి వారిని తమ జాతీయ నాయకులుగా సంభావించడం ఒక ఉదాహరణ మాత్రమే...
రఘురాముడు, యదుకుల కృష్ణుడు ఇలా మత పరిధిలోని వారు కాదు, వారు జాతీయ మహాపురుషులు, ఆంగ్ల పరిభాషలో స్టేట్స్‌మెన్! రఘురాముడు ఆదర్శపాలకుడు, పదహారు శుభంకర లక్షణాలను ఆదర్శాలను ఆచరించి ప్రస్ఫుటింపచేసిన వాడు! అధికారం చెలాయించలేదు, ప్రజలను ఉపాసించాడు! దళితులను, నిరుపేదలను, వన జనులను సోదరులవలె సమాదరించాడు. రామమందిర పునర్నిర్మాణ పథంలో ప్రస్తుతం దళితులు అగ్రగాములై ఉండడం చారిత్రక పునరావృత్తి! మహాకవి డాక్టర్ బోయి భీమన్న అభివర్ణించినట్టు...
‘‘ఒక సతి, ఒక్క మాట, శర మొక్కటి,
ఇయ్యవి మూడొకట్లు, ఇం
దొకటియె చాలు మానవుని
ఉన్నతం చేయగ, మూడు ఒక్కటై
వికసనమొందు మానవుడు
విశ్వాస మున్నతుడేలకాడు? అం
దుకె, పరిపూర్ణుడై జన
మనోరముడయ్యెను రాముడెంతయున్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి